సాహో: 24 గంట‌ల్లోపే కోటి వ్యూస్ వైపు

Update: 2019-03-04 11:53 GMT
డార్లింగ్ ప్ర‌భాస్ బుల్లెట్ దించేసాడు.  `షేడ్స్ ఆఫ్ సాహో చాప్ట‌ర్ 2` అంత‌ర్జాలాన్ని ఒణికిస్తోంది. రిలీజైన 24 గంట‌ల్లోపే కోటిన్న‌ర‌ వ్యూస్ ని అందుకుని సంచ‌ల‌నం సృష్టించ‌బోతోంది. ఇప్ప‌టికే కేవ‌లం 12 గంట‌ల్లోనే చాప్ట‌ర్ 2 వీడియోని 70ల‌క్ష‌ల మంది (7 మిలియ‌న్ వ్యూస్) వీక్షించారు. ఇక‌పైనా ఇదే స్పీడ్ తో దూసుకుపోతే కేవ‌లం 24 గంట‌ల్లోనే కోటిన్న‌ర పైగా వ్యూస్ ద‌క్కించుకోవ‌డం ఖాయ‌మ‌ని అంచ‌నా వేస్తున్నారు.

షేడ్స్ ఆఫ్ సాహో చాప్ట‌ర్ 2 వీడియోతో ప్ర‌భాస్ పూర్తి రూపం ఎలా ఉంటుందో మ‌రోసారి అభిమానుల‌కు క్లారిటీ వ‌చ్చింది. ఇక ఈ చిత్రంలో శ్ర‌ద్ధా క‌పూర్ రోల్ ఏంటి? అన్న‌ది రివీలైంది. శ్ర‌ద్ధా లుక్ మైండ్ బ్లోయింగ్ అంటూ ప్ర‌శంస‌లు కురుస్తున్నాయి. ప్ర‌భాస్ తో పోటీప‌డుతూ శ్ర‌ద్ధా అదిరిపోయే స్టంట్స్ తో చెల‌రేగిపోనుంద‌ని అర్థ‌మ‌వుతోంది. ప్ర‌భాస్ - శ్ర‌ద్ధా జోడీని పెద్ద తెర‌పై వీక్షించేందుకు రెండు క‌ళ్లు స‌రిపోవు! అన్న ంత‌గా సింకైపోయారు ఆ జోడీ.

సాహో మేకింగ్ చాప్ట‌ర్ 1 యూట్యూబ్ లో సంచ‌ల‌నం సృష్టించింది. అంత‌కుమించి చాప్ట‌ర్ 2 దూసుకుపోతోంది. ఈ దూకుడుతో పాటే ప్రీరిలీజ్ బిజినెస్ ప‌రంగానూ భారీ అంచ‌నాలు పెరిగే ఛాన్సుంటుందని అంచ‌నా వేస్తున్నారు. యువి క్రియేష‌న్స్ సంస్థ దాదాపు 225 కోట్ల బ‌డ్జె ట్ తో అంతర్జాతీయ ప్ర‌మాణాల‌తో ఈ భారీ యాక్ష‌న్ చిత్రాన్ని సుజీత్ ద‌ర్శ‌క‌త్వ ంలో తెర‌కెక్కిస్తోంది. ఆగ‌స్టు 15 డెడ్ లైన్ ని దృష్టిలో పెట్టుకుని బ్యాలెన్స్ చిత్రీక‌ర‌ణ వేగంగా పూర్తి చేస్తున్నారు. బాహుబ‌లి సిరీస్ త‌ర్వాత ప్ర‌భాస్ సెల‌క్ష‌న్ ఫెంటాస్టిక్ అన్న ప్ర‌శంస‌లు ఈ వీడియోలు చూశాక అభిమానులు పొగిడేస్తున్నారు. మార్కెట్ వ‌ర్గాల్లోనూ అంతే అంచ‌నాలేర్ప‌డ్డాయి.

Tags:    

Similar News