'ఆడవాళ్లు మీకు జోహార్లు' ఏం నడుస్తోంది!

Update: 2021-10-26 04:21 GMT
శర్వానంద్ హీరోగా రష్మిక హీరోయిన్ గా రూపొందుతున్న 'ఆడవాళ్లు మీకు జోహార్లు' సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. కిషోర్ తిరుమల దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమా 80 శాతం షూటింగ్ పూర్తి చేసుకున్నట్లుగా సమాచారం అందుతోంది. సుధాకర్ చెరుకూరి నిర్మిస్తున్న ఈ సినిమా ప్రస్తుతం రాజమండ్రిలో చిత్రీకరణ జరుపుకుంటోంది. చిత్ర యూనిట్‌ సభ్యులు పలువురు ఈ షెడ్యూల్‌ లో పాల్గొంటున్నారు. శర్వానంద్ మరియు రష్మికలపై కీలక సన్నివేశాల చిత్రీకరణతో సినిమా షూటింగ్ దాదాపుగా పూర్తి అయినట్లే అంటున్నారు. ఈ సినిమా లో శర్వానంద్ పాత్ర చాలా నాచురల్‌ గా మన చుట్టు ఉండే కుర్రాళ్లలో ఒకడిగా అనిపిస్తుందని చిత్ర యూనిట్‌ సభ్యులు చెబుతున్నారు.

రష్మిక మందన్నా పోషించిన పాత్ర కూడా చాలా ప్రత్యేకంగా ఉంటుందని అంటున్నారు. మంచి ఫ్యామిలీ ఎంటర్ టైన్ మెంట్స్ మరియు లవ్‌ కమ్ రొమాంటిక్ సినిమాలను తీసి ప్రేక్షకులను ఎంటర్‌ టైన్‌ చేసిన కిషోర్ తిరుమల మరోసారి ప్రేక్షకులను ఆకట్టుకునే కథ మరియు కథనంతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. షూటింగ్ మెజార్టీ పార్ట్‌ పూర్తి చేసుకోవడంతో సినిమా ఎప్పుడెప్పుడు విడుదల అవుతుందా అంటూ ఆసక్తిగా వ్యక్తం అవుతోంది. ఆడవాళ్లు మీకు జోహార్లు సినిమా టైటిల్ తోనే అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. విభిన్నమైన కాన్సెప్ట్‌ తో రూపొందిన ఈ సినిమా తో శర్వానంద్‌ సక్సెస్ ను తన ఖాతాలో వేసుకుంటాడనే నమ్మకంతో అభిమానులు మరియు ఇండస్ట్రీ వర్గాల వారు ఉన్నారు.

శర్వానంద్ ఇటీవల మహా సముద్రం సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. దసరా కానుకగా వచ్చిన ఆ సినిమా బాక్సాఫీస్ వద్ద బొక్క బోర్లా పడింది. అంతకు ముందు శర్వానంద్‌ నటించిన సినిమాలు కూడా కమర్షియల్‌ గా సక్సెస్‌ లను దక్కించుకోవడంలో విఫలం అయ్యాయి. దాంతో ఈ సినిమాపై అంచనాలు భారీగా ఉన్నాయి. శర్వా కూడా ఈ సినిమా తో సక్సెస్ దక్కించుకుని మళ్లీ ఫామ్‌ లోకి రావాలని ఆశ పడుతున్నాడు. వచ్చే నెల వరకు సినిమా చిత్రీకరణ పూర్తి చేసుకునే అవకాశాలు ఉన్నాయి.. సినిమాను వచ్చే సమ్మర్‌ వరకు విడుదల చేస్తారనే టాక్ కూడా వినిపిస్తుంది. అతి త్వరలోనే సినిమా విడుదల తేదీపై ఒక స్పష్టత ఇచ్చే అవకాశాలు ఉన్నాయి.


Tags:    

Similar News