మొబైల్ మిస్సయితే హాయిగా ఉందట

Update: 2017-04-17 11:35 GMT
మైత్రి మూవీస్ వాళ్ళు నిర్మిస్తున్న రామ్ చరణ్ సినిమా మొదలుపెట్టిన సంగతి తెలిసిందే. ఈ సినిమాకు దర్శకత్వం సుకుమార్.. ఛాయాగ్రహణం రత్నవేలు వహిస్తున్నారు. సౌత్ ఇండియా లో పేరు మోసిన ఛాయాగ్రాహకుడు లో రత్నవేలు ఒక్కరు. సుకుమార్ తో ఇంతకుముందు తీసిన మహేష్ బాబు సినిమా 1-నేనొక్కడినే అతని ప్రతిభకు ఒక ఉదాహరణ గా చెప్పవచ్చు. ఈ మధ్యనే ఖైదీ నెం 150తో కూడా ఇంప్రెస్ చేశాడు.

ఇంకా పేరు పెట్టని ఈ సినిమా కోసం గోదావరి జిల్లాలో ఉన్న కొన్ని పల్లెలకు వెళ్లారు ఈ చిత్ర బృందం. అక్కడ కొన్ని చోట్లా మొబైల్ నెట్వర్క్ కూడా లేని ఊర్లుకి  వెళ్లి చేశారట. ''20 రోజులు మొబైల్ నా దగ్గర లేకుండా ఫిల్మ్ ని షూట్ చేశాను. అక్కడ నెట్వర్క్ కూడా సరిగా లేదు. అలా ఎలా ఉన్నం అని నాకే నమ్మబుద్ది కావడంలేదు. ఇప్పుడు మళ్ళి సిటీ కి వచ్చాక అనిపిస్తోంది.. మొబైల్ ఎంత విలువైన టైం ని హరిస్తుందా అని. మొబైల్ లేకపోతేనే హాయిగా ఉంది'' అంటూ సోషల్ నెట్వర్కులో పేర్కొన్నాడు రత్నవేలు.

ఈ సినిమా పల్లెటూరి ప్రేమ కధతో తెర ఎక్కిస్తున్న సంగతి ఇదివరకే సుకుమార్ చెప్పారు. ఈ సినిమాలో స్టార్ హీరోయిన్ సమంత.. తొలిసారి రామ్ చరణ్‌ తో కలసి నటిస్తుంది. ఈ సినిమా కోసం చరణ్ పూర్తిగా అక్కడ మనషుల వాటం తీరు తెలుసుకొని పాత్ర కు తగట్టు కనిపాస్తడని తెలుస్తోంది. మరి రత్నవేలుతో పాటు వీరందరూ కూడా ఫోన్ మిస్సయినట్లేగా. ఎలా ఉంటున్నారో పాపం!!

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News