టాలీవుడ్ స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ తదుపరి సినిమా విషయంలో ఇంకా సంధిగ్ధం నెలకొంది. ప్రస్తుతం సుకుమార్ దర్శకత్వంలో పుష్ప సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా ఎర్రచందనం స్మగ్లింగ్ నేపథ్యంలో తెరకెక్కుతుంది. యూనివర్సల్ పాయింట్ కాబట్టి సినిమాను పాన్ ఇండియా రేంజిలో ప్లాన్ చేశారు. అయితే ఈ సినిమా ప్రస్తుతం చివరిదశలో ఉంది. అలాగే అల్లు అర్జున్ తదుపరి సినిమా గురించి కూడా చర్చలు జరుగుతున్నాయి. ప్రస్తుతం బన్నీ పుష్ప తర్వాత ఐకాన్ సినిమా చేయనున్న విషయం తెలిసిందే. అలాగే ఐకాన్ సినిమాను దిల్ రాజు నిర్మించనున్నాడు.
కానీ తాజాగా ఐకాన్ సినిమా నిర్మాణంలో గీతా ఆర్ట్స్ కూడా భాగస్వామ్యం కాబోతుందని టాక్ నడుస్తుంది. ఆ వార్తల్లో ఎలాంటి నిజం లేదంటూ వార్తలొస్తున్నాయి. ఎందుకంటే అల్లు అర్జున్ తదుపరి సినిమా ఏంటనేది పుష్ప రిలీజ్ అయ్యాకే పూర్తిగా క్లారిటీ రాబోతుందని టాక్. అయితే తాజా సమాచారం ప్రకారం.. బన్నీ పుష్ప ఫలితం పై ఐకాన్ సినిమా ఆధారపడి ఉందని అంటున్నాయి సినీవర్గాలు. ఎందుకంటే పుష్ప సక్సెస్ అయితే మాత్రం అల్లు అర్జున్ పాన్ ఇండియా ఫేమ్ అందుకుంటాడు. సో ఆ తర్వాత ఐకాన్ కాకుండా పాన్ ఇండియా ఫేమ్ కలిగిన దర్శకుడితో సినిమా చేయడానికి రెడీ అవుతాడని ఇండస్ట్రీ టాక్.
ఒకవేళ పుష్ప ఫలితం అనుకున్నట్లుగా రాకపోతే మాత్రం బన్నీ ఐకాన్ వైపు దృష్టి పెట్టే అవకాశం ఉందని అంటున్నారు. ఎందుకంటే ఆల్రెడీ బన్నీ తదుపరి లిస్టులో పాన్ ఇండియా ఫేమ్ ప్రశాంత్ నీల్.. ఏఆర్ మురుగదాస్ లాంటి దర్శకులు ఉన్నారు. మరి ఇలాంటి సమయంలో ఐకాన్ సినిమా వకీల్ సాబ్ డైరెక్టర్ వేణుశ్రీరామ్ తో చేసే అవకాశం ఉందనుకున్నా ఇప్పుడే కాదేమో అని గుసగుసలు వినిపిస్తున్నాయి. ఇప్పుడు పింక్ సినిమాను సక్సెస్ ఫుల్ గా రీమేక్ అయితే చేయగలిగిన దర్శకుడు ఒరిజినల్ స్క్రిప్ట్ విషయంలో అలాంటి న్యాయం చేయగలడా అనే సందేహాలు వ్యక్తం అవుతున్నాయి. అందులోను ఇంతవరకు వేణు తీసిన సినిమాల్లో భారీ హిట్ అయినవి లేవని టాక్. అలాంటప్పుడు బన్నీ తదుపరి సినిమా విషయం ఐకాన్ కాకుండా వేరే సినిమా ఎంచుకునే అవకాశం ఉందని అంటున్నాయి టాలీవుడ్ వర్గాలు. చూడాలి మరి ఐకాన్ నెక్స్ట్ వస్తుందా లేదా అనేది.