సీమ చిన్నదానిగా సాహో బ్యూటి

Update: 2017-09-17 06:29 GMT
తెలుగు సినిమాల్లో కొత్త తరహా క్యారెక్టర్లను సృష్టించేందుకు మేకర్స్ అండ్ రైటర్స్ తాపత్రయం పెరుగుతోంది. ఇప్పటివరకూ రకరకాల ఆలోచనలతో క్యారెక్టర్లు వచ్చినా.. వారి మాట తీరు మాత్రం ఎక్కువగా కృష్ణా-గుంటూరు జిల్లాల తెలుగు యాసలోనే ఉండేది. ఈ తరహా ఆలోచనలకు ఫుల్ స్టాప్ పెట్టిన చిత్రాలుగా పెళ్లిచూపులు.. ఫిదా నిలిచాయి. తెలంగాణ క్యారక్టర్లతో జనాలను విపరీతంగా ఆకట్టుకున్నాయి.

ఇప్పుడు రాయలసీమ క్యారక్టర్ ను సృష్టిస్తున్నారు మేకర్స్. అది కూడా హీరోయిన్ కు కావడం విశేషం. అత్తారింటికి దారేది చిత్రంలో కోట శ్రీనివాసరావు పాత్ర పూర్తి స్థాయి సీమ యాసలో మాట్లాడడం చూశాం. ఇప్పుడు బాలీవుడ్ హీరోయిన్ శ్రద్ధా కపూర్ తో ఇలాంటి మాటలే పలికించనున్నారు సాహో మేకర్స్. బాహుబలి తర్వాత ప్రభాస్ నటిస్తున్న సాహో చిత్రంలో శ్రద్ధా కపూర్ హీరోయిన్ గా నటిస్తున్న విషయం తెలిసిందే. అయితే.. ఈ సినిమాలో శ్రద్ధా డ్యుయల్ రోల్ చేస్తోందట. వీటిలో ఒక పాత్ర కంప్లీట్ యాక్షన్ మోడ్ లో ఉంటుందని.. మరో రోల్ లో రాయలసీమకు చెందిన పల్లెటూరి అమ్మాయిగా కనిపించనుందని తెలుస్తోంది. కేవలం ఏరియాకు మాత్రమే పరిమితం చేయకుండా.. భాష.. భావజాలం.. కూడా ఇదే తరహాలో ఉండేలా ఈ క్యారెక్టర్ ను డిజైన్ చేశారని అంటున్నారు.

సుజీత్ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ భారీ యాక్షన్ చిత్రం.. ప్రస్తుతం హైద్రాబాద్ లో షూటింగ్ జరుపుకుంటోంది. తెలుగుతో పాటు తమిళ్.. హిందీ భాషల్లో కూడా సాహో తెరకెక్కనుండగా.. ఈ సినిమాలో మరో హీరోయిన్ కు కూడా ఛాన్స్ ఉంటుందట. ఓ టాప్ హీరోయిన్ ను ఈ పాత్రలో నటింపచేసేందుకు మేకర్స్ ప్రయత్నిస్తున్నారు. అయితే.. ఇదేమీ సుదీర్ఘమైన పాత్ర కాదని.. కేమియోకు కొంచెం ఎక్కువగా ఉంటుందని టాక్.
Tags:    

Similar News