సౌత్ హీరోయిన్లతో పోలిస్తే బాలీవుడ్ హీరోయిన్ల రెమ్యూనరేషన్లు ఎక్కువే. అందరికీ రెమ్యూనరేషన్ ఎక్కువ ఉండదు కానీ స్టార్ హీరోయిన్ల రెమ్యూనరేషన్లు మాత్రం భారీ స్థాయిలో ఉంటాయి. ఎవరైనా బాలీవుడ్ స్టార్ హీరోయిన్ ను ఒక తెలుగు సినిమాలో తీసుకున్నారనుకోండి..వారికీ ఫైవ్ స్టార్ హోటల్ వసతి.. రానుపోను ఫ్లైట్ టికెట్స్.. ఇతర సదుపాయాలు కల్పించాల్సి ఉంటుంది. అందుకే పెద్ద స్టార్ హీరోల సినిమాలకు మాత్రమే బాలీవుడ్ హీరోయిన్లను పరిశీలిస్తారు. అయితే ఈమధ్య బాలీవుడ్ మార్కెట్ కోసం.. హిందీ డబ్బింగ్ రైట్స్ కోసం బాలీవుడ్ హీరోయిన్లను తీసుకోవడం ఎక్కువైంది. ప్రభాస్ తాజా చిత్రం 'సాహో' లో బాలీవుడ్ బ్యూటీ శ్రద్ధా కపూర్ హీరోయిన్ గా నటించిన సంగతి తెలిసిందే. మరి శ్రద్ధాకు ఎంత రెమ్యూనరేషన్ ఇచ్చారో తెలుసా?
'సాహో' లో నటించినందుకు శ్రద్ధాకు రూ.7 కోట్లు పారితోషికం ముట్టజెప్పారట. సౌత్ లో హయ్యెస్ట్ రెమ్యూనరేషన్ తీసుకునే హీరోయిన్ నయనతార. ఒక సినిమాకు నయన్ రూ. 5 కోట్ల రూపాయల దాకా ఛార్జ్ చేస్తుందట. ఇప్పుడు శ్రద్ధా రెమ్యూనరేషన్ నయన్ ఫీజు కంటే రెండు కోట్లు ఎక్కువే ఉండడం గమనార్హం. అయితే 'సాహో' ను తెలుగులోనే కాకుండా హిందీ భాషలో స్ట్రెయిట్ సినిమాలాగా విడుదల చేస్తున్నారు కాబట్టి బాలీవుడ్ మార్కెట్ పరంగా చూసుకుంటే ఇదేమీ ఎక్కువ రెమ్యూనరేషన్ లెక్కలోకి రాదు. గతంలో రామ్ చరణ్ 'జంజీర్' లో నటించేందుకు ప్రియాంక చోప్రా ఇంతే రెమ్యూనరేషన్ ఛార్జ్ చేసిందని సమాచారం. అయితే ఆ సినిమా నిరాశపరచడంతో పీసీ రెమ్యూనరేషన్ టాపిక్ పెద్దగా హైలైట్ కాలేదు.
'సాహో' విషయంలో ప్రభాస్ ప్యాన్ ఇండియన్ హీరోగా భారీ ఆకర్షణగా ఉన్నప్పటికీ శ్రద్ధ కూడా బాలీవుడ్ మార్కెట్ కు ఒక మేజర్ అట్రాక్షన్ గా ఉందనడంలో ఏమాత్రం సందేహం లేదు. ఈ సినిమా కనుక హిట్ అయితే ఫ్యూచర్ లో మన ఫిలింమేకర్లు ఇతర బాలీవుడ్ స్టార్ హీరోయిన్ల ను కూడా తమ సినిమాల్లో నటింపజేయడం ఖాయం.