పెళ్లి మాత్రమే లేదా? ప్రేమ కూడా లేదా అమ్మడు?

Update: 2020-01-23 16:29 GMT
బాలీవుడ్‌ ట్రెండీ బ్యూటీ శ్రద్దా కపూర్‌ ప్రేమలో ఉన్న విషయం ప్రతి ఒక్కరికి తెల్సిందే. ఈ అమ్మడు ప్రముఖ స్టైలింగ్‌ ఫొటోగ్రాఫర్‌ రోహన్‌ శ్రేష్టాతో ప్రేమలో ఉన్నట్లుగా గత కొన్నాళ్లుగా వార్తలు వస్తున్నాయి. ఈమె ప్రేమ విషయాన్ని ఆమద్య తండ్రి ఖండించినా కూడా ఈమె మాత్రం పెద్దగా స్పందించడం లేదు. వీరి ప్రేమ పెళ్లి పీఠల వరకు వెళ్లబోతుందని ఈ ఏడాది వీరిద్దరు పెళ్లి చేసుకోబోతున్నారు అంటూ ప్రచారం జరుగుతుంది. ఈ నేపథ్యంలో ఈమెకు ఒకటి రెండు సినిమాలు కూడా దగ్గర వరకు వచ్చి వెళ్లాయట.

పెళ్లి వార్తలు మీడియాలో ప్రముఖంగా వస్తున్న కారణంగా కెరీర్‌ పై ప్రభావం పడుతుందనే ఉద్దేశ్యంతో తాజాగా శ్రద్దా కపూర్‌ స్పందించింది. తాను పదే పదే చెబుతున్నా కూడా పెళ్లి వార్తలు వస్తూనే ఉన్నాయి. ప్రస్తుతానికి నాకు నా కెరీర్‌.. సినిమాలు తప్ప మరే ఆలోచన లేదు. నేను సినిమాలు చేయడంపై మాత్రమే దృష్టి పెట్టాను. మరే ఆలోచన నాకు ప్రస్తుతానికి లేదు అంటూ తాజాగా ఒక ప్రకటనలో ఈ అమ్మడు చెప్పుకొచ్చింది.

అయితే ఈమె ప్రకటనలో క్లారిటీ లోపించింది అంటూ అభిమానులు అంటున్నారు. ప్రస్తుతానికి పెళ్లి ఆలోచన అయితే లేదు అంటూ చెప్పావు.. కాని రోహన్‌ తో ప్రేమ ఉందా లేదా అనే విషయాన్ని మాత్రం క్లారిటీ ఇవ్వలేదు అంటూ నెటిజన్స్‌ కామెంట్స్‌ చేస్తున్నారు. పెళ్లి ఆలోచన లేదు అని మాత్రమే అన్నావు కనుక రోహన్‌ తో ప్రేమ విషయం ఇంకా సస్పెన్స్‌ గానే ఉంది అంటున్నారు. ఆ విషయమై అటో ఇటో క్లారిటీ ఇచ్చేస్తే బాగుండేది కదా అంటున్నారు.

Tags:    

Similar News