వరల్డ్ హెల్త్ డే సందర్భంగా తన సీక్రెట్ బయట పెట్టిన బాలీవుడ్ బ్యూటీ

Update: 2020-04-08 05:18 GMT
ప్రపంచం మొత్తం కరోనా వల్ల అతలాకుతలం అవుతూ ఉంది. ఈ నేపథ్యంలో దేశవ్యాప్తంగా లాక్ డౌన్ ప్రకటించారు. దీంతో సెలెబ్రిటీలంతా ఇంటికే పరిమితమయ్యారు. రోజుకో దేశంలో ఉంటూ క్షణం కూడా వృథా చేయకుండా గడిపే సెలెబ్రిటీలను ఇంటికే పరిమితం చేసింది కరోనా వైరస్. అయితే ఇలా దొరికిన సమయాన్ని కొందరు ఎంజాయ్ చేస్తుంటే.. మరికొంత మంది తెగ ఫీలైపోతున్నారు. లాక్ డౌన్‌లో కొందరు హీరోయిన్స్ పెయింటింగ్ వేస్తూ ఉంటే.. మరికొంత మంది వంటింట్లో చేరి కొత్త రుచులను కనిపెడుతున్నారు. ఇంకొంత మంది ఎప్పటిలానే తమ ఫిట్‌నెస్ శ్రద్ద పెడుతూ వర్కౌట్లు, యోగాలు, వ్యాయమాలు చేసుకుంటూ బిజీగా ఉన్నారు. ఈ నేపథ్యంలో శ్రద్ధా కపూర్ కూడా క్వారంటైన్‌ను బాగా ఎంజాయ్ చేస్తోన్నట్టు కనిపిస్తోంది.

బాలీవుడ్ బ్యూటీ శ్రద్దా కపూర్ గురించి అందరికీ తెలిసిందే. ప్రభాస్ సాహో చిత్రంతో దక్షిణాదిలో కూడా ఫేమస్ అయింది. సినిమా ఫలితం ఎలా ఉన్నా శ్రద్దా కపూర్ మాత్రం అదరగొట్టేసింది. తన గ్లామర్‌తో దక్షిణాది ప్రేక్షకులను కట్టిపడేసింది. 'ఆషికీ 2' చిత్రంతో పరిచయం అయిన శ్రద్దా కపూర్ ఆపై డ్యాన్స్ ప్రధాన చిత్రాల్లో నటించి తన సత్తాను చాటుకుంది. 'ఏబీసీడీ', 'ఏబీసీడీ 2', 'స్ట్రీట్ డాన్సర్' చిత్రాల్లో తన డ్యాన్సులతో అదరగొట్టేసింది. తనకు డ్యాన్స్ అంటే ఎంత ఇష్టమోనన్న సంగతి పలుమార్లు చెప్పిన సంగతి తెలిసిందే.

ఇప్పుడు వరల్డ్ హెల్త్ డే సందర్భంగా సోషల్ మీడియా లో పెట్టిన ఒక పోస్ట్ అందర్నీ విశేషంగా ఆకట్టుకుంటోంది. తనకు డ్యాన్స్ అంటే ఎంత ఇష్టమో చెబుతూ.. నేను ఎక్కువ ఆరోగ్యంగా ఉండటానికి ప్రధాన కారణం డ్యాన్స్. చిన్నప్పటి నుంచి నాకు డ్యాన్స్ అంటే ఇష్టం. ఎన్ని తప్పులు చేసినా పర్లేదు.. ఎలాంటి కష్టమైన స్టెప్ అయినా పర్లేదు.. డ్యాన్స్ చేస్తే నేను సంతోషంగా ఉంటాను.. నాకు డ్యాన్స్ నేర్పించిన కొరియోగ్రాఫర్స్‌కు, డ్యాన్సర్లకు థ్యాంక్స్ అంటూ ఓ వీడియోను పోస్ట్ చేసింది. 
Tags:    

Similar News