సాహో బ్యూటీ పడిన కష్టం

Update: 2019-08-04 01:30 GMT
ఈ నెల 30న విడుదల కాబోతున్న విజువల్ యాక్షన్ గ్రాండియర్ సాహోలో అందరి చూపు ప్రధానంగా హీరో ప్రభాస్ మీదే ఉంది కానీ హీరోయిన్ శ్రద్ధా కపూర్ కూడా ఏదో కేవలం పాటలకే పరిమితం కాకుండా చాలా కీలకమైన సన్నివేశాలు పోరాట దృశ్యాల్లో పాల్గొందట. వాటికి సంబంధించిన విశేషాలను శ్రద్ధా పర్సనల్ ట్రైనర్ మాహెక్ నాయర్ స్వయంగా పంచుకున్నాడు.

రామోజీ ఫిలిం సిటీలో సాహో షూటింగ్ జరుగుతున్ననాళ్లు తన ఫిజిక్ లో ఎలాంటి మార్పు రాకుండా ఫుడ్ విషయంలో శ్రద్ధా చాలా కేర్ తీసుకునేదట. ఒక రోజు ముందుగానే మూడు పూటలకు తీసుకోవాల్సిన డైట్ ని శ్రద్ధ టీమ్ ప్లాన్ చేసి దానికి తగ్గ షెడ్యూల్ నే ప్రొడక్షన్ మేనేజర్ కి ఇచ్చేవారట. ఇంత లైట్ డైట్ చూసి ఆశ్చర్యపోవడం వాళ్ళ వంతు అయ్యేదట. రోజు తెల్లవారకుండానే లేచే శ్రద్ధ సాహో కోసమే రోజు కనీసం నలభై ఐదు నిమిషాల పాటు కఠినమైన శిక్షణ తీసుకుందట

ప్రభాస్ లాంటి హీరోతో యాక్షన్ సీన్స్ చేస్తున్నప్పుడు తేడా రాకుండా అతనికి ధీటుగా కనిపించాలంటే ఒళ్ళు వంచాల్సిందే అని డిసైడ్ అయిపోయి టీమ్ ని రెగ్యులర్ గా యాక్టివ్ గా ఉంచేదట. ఒకవేళ పని బడలిక వల్ల ఎప్పుడైనా ఉదయం మాహెక్  లేవడం లేట్ అయితే శ్రద్ధనే స్వయంగా ఫోన్ లేదా మెసేజ్ చేసే లేపేదట. ఇంత వర్క్ అవుట్ చేసింది కాబట్టి రేపు తెరపై శ్రద్ధ పెర్ఫార్మన్స్ చూసి షాక్ అవుతారని మాహెక్ హామీ ఇస్తున్నాడు.

మొత్తానికి ఇవన్నీ వింటూ ఉంటే ఒక్క ఆర్టిస్ట్ విషయంలో ఇంత కేర్ తీసుకుని ట్రైనింగ్ ఇచ్చేలా ఒప్పించారు అంటే ఇక సినిమా గురించి ఎంత కష్టపడి ఉంటారో వేరే చెప్పాలా.రిలీజ్ కు ఇంకో 27 రోజులు మాత్రమే ఉన్న నేపథ్యంలో ప్రమోషన్ కు సంబంధించి ప్రత్యేకమైన ప్లాన్ లో ఉంది యూనిట్. త్వరలో వాటిలో పాల్గొనేలా శ్రద్దా కపూర్ సైతం డేట్స్ ని అందుబాటులో ఉంచుకోనుంది.

    

Tags:    

Similar News