తెలుగు బుల్లి తెర ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న బిగ్ బాస్ ఓటీటీ స్ట్రీమింగ్ కు సిద్దం అయ్యింది. ఇప్పటికే కంటెస్టెంట్స్ ఫైనల్ అయ్యారు.. వారి ఏవీ షూటింగ్ అయ్యింది. అంతే కాకుండా వారికి సంబంధించిన హెల్త్ చెకప్స్ పూర్తి అయ్యాయి.. కరోనా వ్యాక్సినేషన్ ఇంకా ఇతర విషయాలు అన్ని కూడా ముగించేసి క్వారెంటైన్ కు తరలించారు. ప్రస్తుతం అంతా కూడా క్వారెంటైన్ లో ఉన్నారు. ఈసమయంలో కంటెస్టెంట్స్ విషయమై పీక్స్ లో చర్చ జరుగుతూనే ఉంది.
పాత మరియు కొత్త వారి కలయికలో బిగ్ బాస్ ఓటీటీ ఉండబోతుంది అంటూ ఇప్పటికే డిస్నీ ప్లస్ హాట్ స్టార్ వారు కూడా క్లారిటీ ఇచ్చారు. మెజార్టీ కంటెస్టెంట్స్ పాత వారే ఉన్నా ఆశ్చర్యం లేదు. ఈ సమయంలో ఈ షో లో శ్రీ రాపాక ను ఎంపిక చేశారని.. ఇప్పటికే ఆమె క్వారెంటైన్ కు వెళ్లిందని ఆమె సన్నిహితుల ద్వారా తెలుస్తోంది. శ్రీ రాపాక సుదీర్ఘ కాలంగా ఇండస్ట్రీలో కొనసాగుతూ వస్తుంది. కాని ఆమె కు పెద్దగా గుర్తింపే రాలేదు.
ఎప్పుడైతే వర్మ సినిమాలో ఆమె నటించిందో ఒక్కసారిగా ఆమె గురించి జనాలు మాట్లాడుకోవడం మొదలు అయ్యింది. ఆమె ను వర్మ తనదైన శైలిలో చూపించారు. శ్రీ రాపాక ను పూర్తిగా కొత్తగా చూపించి అబ్బో అంటూ జనాలు నోరు వెళ్లబెట్టేలా చేశాడు.
వర్మ తెరకెక్కించిన నగ్నం సినిమా తర్వాత ఆమెకు వరుసగా ఆఫర్లు వచ్చాయి. ఆమె అనూహ్యంగా ఇతర సినిమాల్లో కూడా ఆఫర్లు దక్కించుకుంది. అదే సమయంలో సోషల్ మీడియాలో పేమస్ అయ్యింది.
వర్మ హీరోయిన్ అనే బ్రాండ్ ఇమేజ్ ను సొంతం చేసుకోవడం ద్వారా బిగ్ బాస్ నుండి ఈ అమ్మడికి పిలుపు వచ్చింది. గత సీజన్ ల్లోనే ఆమెను ఆహ్వానించాల్సి ఉన్నా కొన్ని కారణాల వల్ల ఆమెను దూరంగా ఉంచారనే టాక్ వినిపిస్తుంది. ఇక శ్రీ రాపాక మాత్రమే కాకుండా ఆమెను మించిన బోల్డ్ ముద్దుగుమ్మలు.. అంతకు మించిన వివాదాస్పద ముద్దుగుమ్మలు ఈ ఓటీటీ సిజన్ లో సందడి చేయబోతున్నట్లుగా వార్తలు వస్తున్నాయి.
ఇంత మంది బోల్డ్ ముద్దుగుమ్మలు హడావుడి చేయబోతున్న ఈ బిగ్ బాస్ ను పెద్దలు మాత్రమే చూడాలేమో. బిగ్ బాస్ అంటే చిన్న పిల్లలు కూడా ఆసక్తి చూపిస్తూ ఉంటారు. ఫ్యామిలీ ఆడియన్స్ చూస్తారు. కుటుంబం అంతా కలిసి బిగ్ బాస్ ను ఎంజాయ్ చేయాలనుకుంటారు. కాని ఓటీటీ వర్షన్ ను మాత్రం అలా చూడటానికి లేదేమో అనే పుకార్లు గుప్పుమంటున్నాయి.
మరీ అంత బోల్డ్ గా.. వల్గర్ గా ఉంటే ఖచ్చితంగా జనాలు ఊరుకోరు. కనుక ఆ స్థాయిలో లేకున్నా పెద్దలు మాత్రమే చూసే విధంగా ఉంటుందని కొందరు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.
మా టీవీలో ప్రసారం అయిన బిగ్ బాస్ లోని కొన్ని ఎపిసోడ్ లు గొడవలు మరియు రొమాన్స్ ల వల్ల పిల్లలతో కలిసి చూడలేక పోయారు. ఓటీటీ లో అంటే ఖచ్చితంగా అంతకు మించి అన్ని ఉంటాయి. కనుక ఖచ్చితంగా ఓటీటీ బిగ్ బాస్ రచ్చ రచ్చ ఉండటం ఖాయం అనిపిస్తుంది.