తెలుగు, తమిళ, హిందీ భాషల్లో క్రేజీ హీరోయిన్ గా మంచి గుర్తింపుని సొంతం చేసుకున్న హీరోయిన్ శ్రియ. `ఇష్టం` మూవీతో కెరీర్ ప్రారంభించిన శ్రియ ఇప్పటికీ అదే క్రేజ్ ని కంటిన్యూ చేస్తూ హీరోయిన్ గా కొనసాగుతోంది. దాదాపు 20 ఏళ్లుగా ఇండస్ట్రీలో కొనసాగుతున్న శ్రియ గత కొంత కాలంగా క్రేజ్ తగ్గడంతో తనని వెతుక్కుంటూ వస్తున్న చిత్రాల్లో మాత్రమే నటిస్తూ ఆకట్టుకుంటోంది. రష్యన్ బ్యాడ్మింటన్ ప్లేయర్ ఆండ్రూ కోశ్చివ్ ని 2018లో వివాహం చేసుకున్న శ్రియ ఓ పాపకు జన్మనిచ్చిన విషయం తెలిసిందే.
గత కొంత కాలంగా క్రేజ్ తగ్గడంతో కీలక పాత్రల్లో మాత్రమే నటిస్తూ వస్తోంది. దేశ వ్యాప్తంగా క్రేజ్ ని సొంతం చేసుకున్న `ఆర్ ఆర్ ఆర్`లో సరోజినిగా కీలక పాత్రలో నటిస్తోంది. గత కొంత కాలంగా రిలీజ్ వాయిదా పడుతున్న ఈ మూవీ ఈ నెల 25న ప్రపంచ వ్యాప్తంగా విడుదలకు సిద్ధమవుతున్న విషయం తెలిసిందే. ఇదిలా వుంటే ఈ రోజు సోషల్ మీడియా ఇన్ స్టా వేదికగా శ్రియ షేర్ చేసిన పోస్ట్ ప్రస్తుతం నెట్టింట వైరల్ గా మారింది.
ఆపరేషన్ కు సిద్ధంగా వున్న తన భర్త ఆండ్రూ కోశ్చివ్ ఫొటోలని షేర్ చేసిన శ్రియ ఆ ఫొటోలతో పాటు ఆసక్తికరమైన పోస్ట్ ని షేర్ చేసింది. ఆండ్రూకి హెర్నియా వుంది. దాని కారణంగా ఇబ్బందిపడుతున్న ఆండ్రూ రాధని ఎంత్తుకోలేకపోయాడు. గత రెండు నెలలుగా ఈ సమస్యతో బాధపడుతున్న ఆండ్రూ విషయంలో అపోలో హాస్పిటల్స్ వారు పాజిటివ్ గా స్పందించి ప్రత్యేక కేర్ తీసుకున్నందుకు ధన్యవాదాలు. అంతే కాకుండా డాక్టర్ రజనీష్ రెడ్డికి, మాకు సహకారాన్ని అందించినందుకు ఉపాసన కొణిదెలకు ప్రత్యేక ధన్యవాదాలు అని తెలిపింది శ్రియ.
గత రెండు నెలలుగా శ్రియ భర్త హెర్నియా కారణంగా బాధపడుతున్నారట. దాని వల్లే కూతురు రాధని కనీసెం ఎత్తుకోలేక పోతున్నారట. అయితే ఇందుకు సంబంధించిన ఆపరేషన్ ని అపోలో హాస్పిటల్ లో డాక్టర్ రజనీష్ రెడ్డి ఆధ్వర్యంలో విజయవంతంగా పూర్తి చేశారట. ఇదే విషయాన్ని శ్రియ సోసల్ మీడియా ద్వారా అభిమానులతో పంచుకుంది. ప్రస్తుతం శ్రియ పెట్టిన తాజా పోస్ట్ నెట్టింట వైరల్ గా మారింది.
Full View

శ్రియ ప్రస్తుతం మలయాళ సూపర్ హిట్ ఫిల్మ్ `దృశ్యం -2` ఆధారంగా తెరకెక్కుతున్న బాలీవుడ్ రీమేక్ లో నటిస్తోంది. అజయ్ దేవగన్ హీరోగా నటిస్తున్నారు