హీరోయిన్ గా శ్రియ శరన్ ను గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. దాదాపుగా రెండు దశాబ్దాల పాటు ఇండస్ట్రీ లో ప్రేక్షకులను అలరిస్తూనే ఉంది.
కొందరు హీరోయిన్స్ పెళ్లి అయిన తర్వాత సినిమాలకు దూరం అవుతారు.. కొందరు పిల్లలు అయ్యాక ఇండస్ట్రీలో కనిపించకుండా కనుమరుగవుతారు. కాని శ్రియ మాత్రం పెళ్లి అయ్యి పిల్లలు ఉన్నా కూడా ఇండస్ట్రీలో ఉంది.. జనాల్లో ఉంటుంది.
శ్రియ తన వ్యక్తిగత విషయాలను రెగ్యులర్ గా సోషల్ మీడియా ద్వారా షేర్ చేస్తూ ఉంటుంది. ఆమె భర్త మరియు ఆమె లైఫ్ ను ఎంతగా ఎంజాయ్ చేస్తున్నారో వారు షేర్ చేస్తున్న ఫోటోలు మరియు వీడియోలను చూస్తుంటే అర్థం చేసుకోవచ్చు. తాజాగా వీరికి పాప పుట్టింది. ఆ పాపను కూడా సోషల్ మీడియాలో సెలబ్రెటీని చేశారు.
ఫారినర్ ఆండ్రూ ను వివాహం చేసుకున్నా కూడా శ్రియ తన కూతురుకు రాధా అంటూ ఒక హిందూ పేరును పెట్టింది. రాధా కు తాజాగా చెవులు కుట్టించారు. హిందూ సాంప్రదాయంలో చెవులు కుట్టించడం కు ప్రత్యేక ప్రాముఖ్యత ఉంటుంది. ఆ ముఖ్య ఘట్టం ను శ్రియ హిందూ సాంప్రదాయం ప్రకారం నిర్వహించి ముచట్ట తీర్చుకుంది.
హీరోయిన్ గా ఎంతటి పాపులారిటీని దక్కించుకుందో ఇప్పుడు అదే స్థాయి లో శ్రియ సోషల్ మీడియాలో హడావుడి చేస్తోంది.
ఇటీవల ఆర్ ఆర్ ఆర్ సినిమా లో నటించిన ఈ అమ్మడు తల్లిగా మారినా కూడా సినిమాల విషయంలో మాత్రం తగ్గేదే లే అంటోంది. హీరోయిన్ గానే కాకుండా క్యారెక్టర్ ఆర్టిస్టుగా కూడా ఈ అమ్మడు సినిమాలు చేసేందుకు సిద్ధం అంటోంది.