మొదటిసారి భర్త ఫోటోలు షేర్ చేసింది!

Update: 2019-05-30 08:47 GMT
సీనియర్ హీరోయిన్ శ్రియ శరణ్ పోయినేడాది మార్చ్ నెలలో తన రష్యన్ బాయ్ ఫ్రెండ్ ఆండ్రీ కొస్చీవ్ ను వివాహం చేసుకొని తన జీవితంలో కొత్త అధ్యాయాన్ని మొదలు పెట్టింది.  ఆండ్రీ ఒక బిజినెస్ మ్యాన్ కమ్ టెన్నిస్ ప్లేయర్.   శ్రియా వివాహానికి సంబంధించిన కొన్ని వీడియోలు అప్పట్లోనే బయటకు వచ్చాయి కానీ శ్రియ హబ్బీ ఫోటోలు మాత్రం మీడియాలో రాలేదు. శ్రియ సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటుంది కానీ ఎప్పుడూ తన ప్రియమైన భర్త ఫోటోలు షేర్ చేసింది లేదు.  కానీ తాజాగా ఆండ్రీ ఫోటోలు షేర్ చేసి అందరినీ  ఆశ్చర్యంలో ముంచెత్తింది.

శ్రియ- ఆండ్రీ జంట ప్రస్తుతం పెరు దేశంలో హాలిడే ట్రిప్ ను ఎంజాయ్ చేస్తున్నారు. మొదట మెక్సికో ను కవర్ చేసిన ఈ జంట పెరు దేశానికి షిఫ్ట్ అయ్యారు. ఈ ట్రిప్ లోని కొన్ని అందమైన క్షణాలను ఫోటోల రూపంలో బంధించి ఆ ఫోటోలనే తన సోషల్ మీడియా ఖాతా ద్వారా షేర్ చేసింది.   ఈ ఫోటోలలో ప్రత్యేకత ఏంటంటే.. ఒకరిపై ఒకరు తమ ప్రేమను బహిరంగంగా వెలిబుచ్చడం. ఒక ఫోటోలో ఆండ్రీ తన భార్యామణికి ముద్దుపెడితే మరో ఫోటోలో శ్రియ తన భర్తగారికి ముద్దిచ్చింది. ఏమాటకామాటే చెప్పుకోవాలి.. ఇద్దరూ చిలకాగోరింకల్లాగా ఉన్నారు.

సినిమాల విషయానికి వస్తే శ్రియకు ప్రస్తుతం తెలుగులో ఆఫర్లేమీ లేవు.  అయితే తమిళంలో మాత్రం  'నరగాసురన్'.. 'సండకారి' అనే సినిమాలలో నటిస్తోంది.  హిందీలో 'తడ్కా' అనే మరో సినిమాలో కూడా నటిస్తోంది.
Tags:    

Similar News