ఫోటో స్టొరీ: ఎంత ఘాటు ప్రేమయో.. !

Update: 2019-09-04 10:31 GMT
హీరోయిన్ శ్రియ పోయినేడాది తన లాంగ్ టైమ్ బాయ్ ఫ్రెండ్ ఆండ్రీ కొస్చీవ్ ను పెళ్ళి చేసుకున్నప్పటినుంచి సినిమాలలో కాస్త జోరు తగ్గించింది.  ఇప్పటికీ శ్రియ చేతిలో మూడు నాలుగు సినిమాలు ఉన్నాయి కానీ గతంలో లాగా ఫుల్ బిజీగా అయితే ఉండడం లేదు.  కొంచెం గ్యాప్ దొరికితే భర్త తో ఏదో ఒక వెకేషన్ కు చెక్కేయడం.. అక్కడ ఫుల్ గా ఎంజాయ్ చేయడం ఒక అలవాటుగా మారిపోయింది.  రీసెంట్ గా స్పెయిన్ లోని బార్సిలోనా విహరించింది ఆండ్రీ - శ్రియ జంట.

ఈ సందర్భంగా స్పెయిన్ లో మరో ప్రదేశం అయిన ఇబీజాను గుర్తు చేసుకుంది. అప్పట్లో ఇద్దరూ ఇబీజాను సందర్శించారట.  అప్పటి వీడియోను శ్రియ రీసెంట్ గా పోస్ట్  చేసిన సంగతి తెలిసిందే. వీడియోలో మ్యూజిక్ కు తగ్గట్టుగా శ్రియ బికినీ లో నడుము ఊపుతూ నాట్యం కూడా చేసింది.  ఆ వీడియోతో పాటుగా మరో సెల్ఫీ ని కూడా పోస్ట్ చేసింది.  ఆ సెల్ఫీని తీసినవారు ఆండ్రీ. ఆ సెల్ఫీలో శ్రియ తన భర్త భుజాలపై వాలిపోయి.. ఆయనగారి గడ్డాన్ని నిమురుతూ.. స్మైల్ ఇస్తూ పోజిచ్చింది. ఇక ఆండ్రీ కూడా సూపర్ స్మైల్ ఇస్తూ సెల్ఫీ తీసుకున్నాడు.  ఇద్దరిని చూస్తుంటే యూజర్ ఐడి - పాస్ వర్డ్ ల తరహాలో కలిసిమెలిసిపోయి విడదీయలేనట్టున్నారు.  

సహజంగా హీరోల కంటే హీరోయిన్లు అందంగా ఉంటారు.  కానీ ఈ జంట మాత్రం రివర్స్.. శ్రియకంటే ఆండ్రీ ఎర్రగా బుర్రగా.. టచ్ చేస్తే కందిపోతాడేమో అన్నట్టుగా అందంగా ఉన్నాడు.  ఫేస్ లో ఆ ఇన్నోసెంట్ స్మైల్ కూడా సూపర్.  అందుకే ఆండ్రీని శ్రియ ఒక్క క్షణం కూడా వదలకుండా ఫెవికాల్ లా అతుక్కుని కొంచెం కొంచెం కొరుక్కుతింటున్నట్టుంది. సినిమాల విషయానికి వస్తే శ్రియ ప్రస్తుతం హిందీలో 'తడ్కా'..  తమిళంలో 'నరగశూరన్'.. 'సండకారి' అనే చిత్రాల్లో నటిస్తోంది.  తెలుగులో కూడా ఒక అన్ టైటిల్డ్ మూవీలో నటిస్తోంది.
Tags:    

Similar News