తెలుగు - తమిళ్ - హిందీ మూడు భాషల్లో క్వీన్ గా వెలిగిపోతోంది శ్రుతి హాసన్. క్షణం తీరిక లేనంత బిజీగా ఉంది. ప్రస్తుతం తమిళ్ - హిందీ ప్రాజెక్టుల కోసం చెన్నయ్ టు ముంబై విరామం లేకుండా తిరిగేస్తోంది. అంతేకాదు .. ఇలా ప్రయాణాల్లో తిరిగేప్పుడు ఆ సమయాన్ని కూడా వృథా చేయకుండా అభిమానులతో చాటింగులు చేస్తో్ంది. ఆ విధంగా తనకి ఇప్పటికి 30 లక్షల మంది ట్విట్టర్ ఫాలోవర్స్ పుట్టుకొచ్చారు. ఓ స్టార్‌కి ఇది అసాధారణ ఫాలోయింగ్ అనే చెప్పాలి. అనునిత్యం ట్విట్టర్ లో యాక్టివ్‌గా ఉంటేనే ఇదంతా సాధ్యమవుతుంది.
ఇన్ని బిజీ షెడ్యూల్స్ మధ్య ఇంతమంది ఫాలోవర్స్ కి రిప్లయ్ లు ఇస్తూ లైక్ లు కొట్టించుకోవడం అంటే మాటలా? గబ్బర్ ఈజ్ బ్యాక్ - వెల్ కం బ్యాక్ చిత్రాలతో విజయాలు అందుకున్న తర్వాత అమ్మడికి బాలీవుడ్ నుంచి అభిమానులు పెరిగిపోయారు. ఇక ఎలానూ తెలుగు - తమిళ్ లోనూ బోలెడంత మంది ఫ్యాన్స్. దీన్నిబట్టి కోట్లాది మంది అభిమానులు ఈ అమ్మడితో ట్విట్టర్ వేదికగా మాట్లాడాలని తహతహలాడిపోతున్నట్టు అర్థం చేసుకో్వచ్చు.
మూడు మిలియన్ల అభిమానులకు థాంక్స్. ఐ లవ్ యు ఆల్ .. అంటూ ట్వీట్ ఇచ్చింది. ఆ ఒక్క మాట చాలదూ? ప‌్రేమిస్తున్నా అని అంటే చాలదూ? అభిమానులంతా దిల్ ఖుషీ ఫీలవ్వరూ.. ప్చ్ .. ఇంతమందిని వెంటపడేలా చేసుకుందంటేనే అర్థం చేసుకోవాలి.