కమల్ కూతురిపై శ్రీదేవికి ఎంత ప్రేమో..

Update: 2015-09-23 15:30 GMT
దాదాపు రెండు దశాబ్దాల తర్వాత సౌత్ ఇండియాలో అడుగుపెడుతోంది అతిలోక సుందరి శ్రీదేవి. సౌత్ సెకండ్ ఇన్నింగ్స్ లో భాగంగా ఆమె చేసిన తొలి సినిమా ‘పులి’. ఇంకో వారం రోజుల్లో ఆ సినిమా ప్రేక్షకుల ముందుకొచ్చేస్తోంది. సౌత్ మూవీ అని చిన్నచూపేమీ లేకుండా ‘పులి’ని బాగానే ప్రమోట్ చేస్తోంది శ్రీదేవి. హిందీ వెర్షన్ ను ప్రమోట్ చేసే బాధ్యత దాదాపుగా తనే తీసుకుంది. మీడియా వాళ్లను పిలిచి  మరీ ఇంటర్వ్యూలిచ్చేస్తోంది. ఈ సందర్భంగా ‘పులి’ అనుభవాల గురించి.. ఈ సినిమా హీరోయిన్ శ్రుతి హాసన్ గురించి ఆసక్తికర విశేషాలు చెప్పింది శ్రీదేవి.

శ్రుతి తండ్రి కమల్ తో శ్రీదేవి క్లాసిక్స్ చేసిందన్న సంగతి తెలిసిందే. మరి కమల్ కూతురితో నటించడం ఎలా ఉందని అడిగితే.. ‘‘పులికి పని చేసిన మిగతా వాళ్లందరితో పోలిస్తే శ్రుతితో నాకు చాలా స్పెషల్ బాండింగ్ ఉంది. ఆమె అంటే నాకెందుకు అంతిష్టమో తెలియలేదు. కానీ తనను చాలా క్లోజ్ గా ఫీలయ్యేదాన్ని. తన టాలెంట్ చూసి ఆశ్చర్యపోయా. మంచి ఫిజిక్ కూడా ఉన్న అమ్మాయి. ఓ టాప్ హీరోయిన్ కు ఉండాల్సిన క్వాలిటీస్ అన్నీ శ్రుతికి ఉన్నాయి. శ్రుతి స్వీట్ గర్ల్. తనతో పని చేయడం నాకు చాలా చాలా సంతోషాన్నిచ్చింది’’ అని చెప్పింది అతిలోక సుందరి.

పులి కథ వినీ వినంగానే ఒప్పేసుకున్నాని.. తన కెరీర్లో ఇప్పటిదాకా ఇలాంటి సినిమా, ఇలాంటి పాత్ర చేయలేదని శ్రీదేవి చెప్పింది. తన పాత్ర గురించి తెలుసుకున్నాక.. కాస్ట్యూమ్స్ విషయంలో మనీష్ మల్హోత్రా మాత్రమే న్యాయం చేయగలడని తనే స్వయంగా అతణ్ని పిలిపించి తన క్యారెక్టర్ కి తగ్గ కాస్ట్యూమ్స్ డిజైన్ చేయించుకున్నట్లు శ్రీదేవి చెప్పింది.
Tags:    

Similar News