కొన్ని ‘ఫిజిక్’లంతే మరి. డ్రెస్సేస్తే వాళ్లకు అందం రావడం కాదు. ఆ డ్రెస్సుకే అందం వచ్చేస్తుందంతే. శ్రుతి హాసన్ సరిగ్గా అదే టైపు. ఈ చెన్నై పిల్ల పొట్టి డ్రెస్సులేసుకుని.. స్కిన్ షో చేసినా తట్టుకోలేం. ఏ హంగామా లేకుండా సింపుల్ గా ఓ టీషర్ట్ వేసినా కళ్లు తిప్పుకోలేం. కావాలంటే పైన ఆ ఫొటో చూడండి. జీన్స్ వేసుకుని.. ‘గ్యాప్’ టీషర్ట్ తగిలించుకుని అలా క్యాజువల్ గా కూర్చుని కుర్ర గుండెలకు ఎలా గాయం చేస్తోందో గమనించండి. ఆ చూపుల్లో ఇరుక్కోకుండా తప్పించుకోవడం ఏ మగ మహారాజుకు సాధ్యం చెప్పండి. బెంగళూరులో ‘గ్యాప్’ షోరూం ప్రారంభోత్సవం సందర్భంగా ఆ కంపెనీ టీషర్ట్ వేసుకుని ఇలా దర్శనమిచ్చింది శ్రుతి. ఈ ఫొటో చూశాక కుర్రాళ్ల గుండెల్లో శ్రుతి బొమ్మ కాకుండా కొంచెం ‘గ్యాప్’ అయినా ఉంటుందా అసలు!!!