అక్కడికెళ్తే కదలనివ్వరట..

Update: 2017-01-17 09:48 GMT
బాలీవుడ్‌లో నటించడాన్ని ప్రతిష్ఠాత్మకంగా భావిస్తారు నాయికలు. హిందీ సినిమా చేస్తే కెరీర్‌ మరో మెట్టు ఎక్కినట్లే అన్నది వాళ్ల నమ్మకం. దక్షిణాదిలోని స్టార్‌ హీరోయిన్లు మాత్రం ఇందుకు భిన్నంగా స్పంది స్తారు. బాలీవుడ్‌ కంటే ప్రాంతీయ చిత్రాల్లోనే సౌక్యంగా ఉన్నామన్నది వాళ్ల మాట. ప్రస్తుతం శృతిహాసన్‌ కూడా ఇదే మాట చెబుతోంది. తాను దక్షిణాది సినిమాలను కోరుకోవడం వల్లే హిందీలో ఎక్కువ సినిమా చేయడం లేదని శృతి అంటోంది. సౌత్‌ సినిమాలే తన తొలి ప్రాధాన్యత అని స్పష్టం చేసింది.
    
నిజానికి శృతి కెరీర్ హిందీలో ‘లక్‌ ‘తో మొదలైంది.  ఆ తరువాత ‘రామయ్యా వస్తావయ్యా’, ‘డీ డే’, ‘గబ్బర్‌ ఈజ్‌ బ్యాక్‌’ చిత్రాలతో కొనసాగింది. అయితే ఆమె చేసిన తెలుగు, తమిళ చిత్రాలతో పోల్చితే వీటి సంఖ్య చాలా తక్కువ. ఈ విషయం గురించి శృతి హాసన్‌ మాట్లాడుతూ..’ దక్షిణాది సినిమాలు చేసినంత సులువుగా హిందీ సినిమాలు చేయలేం. అక్కడ చాలా నిబంధనలు ఉంటాయి. వాళ్ల రూల్స్‌ కు తగినట్లు నేను ఆడలేను. బాలీవుడ్‌ సినిమా చేయాలంటే ముంబైలోనే ఉండిపొమ్మంటారు. ఇక్కడ చెన్నైలో ఉండి తమిళం - తెలుగు సినిమాలు చేయొచ్చు. అందుకే నేను ఎక్కువగా దక్షిణాది చిత్రాలకే ప్రాధాన్యమిస్తా. నా ప్రతిభను వెలితితెచ్చే కథ, పాత్ర బాలీవుడ్‌ లో ఇంకా రాలేదు.’ అని చెప్పింది.
    
ఇటీవల ‘ప్రేమమ్‌’ తో తెలుగులో హిట్‌ అందుకున్న శృతి ప్రస్తుతం పవన్‌ కళ్యాణ్‌ సరసన ‘కాటమరాయుడు’ లో నటిస్తోంది. పవన్ తో ఇప్పటికే ఒకసారి గబ్బర్ సింగ్ వంటి సూపర్ డూపర్ హిట్ కొట్టిన ఈ భామ తాజాగా కాటమరాయుడుతో మరో హిట్ కొట్టడానికి రెడీ అవుతున్నానంటోంది.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News