ల‌వ్ బ‌ర్డ్స్ న‌ల్ల‌ని మేఘాల‌ని త‌యారు చేస్తార‌ట‌!

Update: 2022-09-06 03:30 GMT
క్రేజీ హీరోయిన్ శృతిహాస‌న్ ప్ర‌స్తుతం మూడు భారీ ప్రాజెక్ట్ ల‌లో న‌టిస్తూ బిజీ బిజీగా గ‌డిపేస్తోంది. ఇద్ద‌రు సీనియ‌ర్ హీరోల‌తో పాటు పాన్ ఇండియా స్టార్ ప్ర‌భాస్ తోనూ న‌టిస్తోంది. మెగాస్టార్ చిరంజీవితో మైత్రీ వారు నిర్మిస్తున్న `వాల్తేరు వీర‌య్య‌`లో, గోపీచంద్ మ‌లినేని.. నంద‌మూరి బాల‌కృష్ణ తో రూపొందిస్తున్న మూవీలోనూ నటిస్తోంది. ఇక ప్ర‌భాస్ తో `స‌లార్‌`లో న‌టిస్తున్న విష‌యం తెలిసిందే. ఇలా ఒకేసారి ఇద్ద‌రు సీనియ‌ర్ హీరోల‌తోనూ, ప్ర‌భాస్ తోనూ న‌టిస్తున్న శృతిహాస‌న్ టైమ్ దొరికితో జాలీగా గ‌డిపేస్తోంది.

గ‌త కొంత కాలంగా శాంత‌ను హ‌జారికాతో క‌లిసి శృతిహాస‌న్ స‌హ‌జీవినం చేస్తున్న విష‌యం తెలిసిందే. క‌రోనా టైమ్ నుంచి వీరిద్ద‌రి అనుబంధం కొన‌సాగుతోంది. ఒకే ఇంట్లో వుంటూ అప్పుడ‌ప్పుడు శంత‌ను తో క‌లిసి చేసే అల్ల‌రి ప‌నులకు సంబంధించిన ఫొటోల‌ని, వీడియోల‌ని షేర్ చేస్తూ గ‌త కొంత కాలంగా నెట్టింట సంద‌డి చేస్తూ వ‌స్తోంది శృతిహాస‌న్‌. తాజాగా  బ్లాక్‌ అండ్ వైట్ ఫొటోని అభిమానుల‌తో పంచుకున్న శృతి కొన్ని న‌ల్ల‌ని మేఘాల‌ని త‌యారు చేద్దాం బేబీ` అంటూ పోస్ట్ చేసింది.

ల‌వ్ బ‌ర్డ్స్ షేర్ చేసిన తాజా ఫొటో ప్ర‌స్తుతం నెట్టింట వైర‌ల్ గా మారింది. ఈ సంద‌ర్భంగా ఓ మీడియాతో శృతి మాట్లాడుతూ శంత‌ను హ‌జారికాపై ప‌లు ఆస‌క్తిక‌ర కామెంట్ లు చేసింది. త‌ను నా బెస్ట్ ఫ్రెండ్. త‌ను అద్భుత‌మైన వ్య‌క్తి.

ప్ర‌తిభావంతుడైన వ్య‌క్తి.. అంతే కాకుండా చాలా ప్ర‌త్యేక‌మైన మ‌నిషి. ప్ర‌జ‌లు మేము చాలా సార్లు ఫొటోల‌కు పోజులిస్తామ‌ని అనుకుంటుంటారు. సాధార‌ణంగా ఆనందంగా క‌నిపించిన‌ప్పుడు లేదా మ‌రేదైనా సంద‌ర్భంలోనో ఫొటోల‌కు పోజులిస్తుంటాం.

కానీ మేము అలా కాదు ప్ర‌తీ క్ష‌ణాన్ని సెల‌బ్రేట్ చేసుకోవాల‌నుకుంటాం. జీవితాన్ని సోష‌ల్ మీడియాలో పంచుకోవ‌డానికి ఇష్ట‌ప‌డ‌తాను. వ్య‌క్తులు నాతో క‌నెక్ట్ అవ‌డానికి ఇది గొప్ప మార్గ‌మ‌ని న‌మ్ముతాను. అందుకే ఇది నా జీవితంలో ఓ భాగం అయిపోయింది`అని తెలిపింది శృతిహాస‌న్‌. ఇటీవ‌ల నంద‌మూరి బాల‌కృష్ణ తో క‌లిసి న‌టిస్తున్న NBK 107 చిత్రీక‌ర‌ణ కోసం శృతిహాస‌న్ ఇటీలీ వెళ్లిన విష‌యం తెలిసిందే. దునియా విజ‌య్ విల‌న్ గా న‌టిస్తున్న ఈ మూవీలో వ‌ర‌ల‌క్ష్మీ శ‌ర‌త్ కుమార్, మ‌ల‌యాళ న‌టుడు లాల్‌ కీల‌క పాత్ర‌ల్లో న‌టిస్తున్నారు.

నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.
Tags:    

Similar News