ఈ ఇద్దరూ సామాజిక జిజ్ఞాస కోసం పాకులాడేవారే.. సమాజం కోసం ఏదైనా చేయాలి అన్న మంచి తలంపు ఉన్నవారే. డబ్బు - ధస్కం ఎంత సంపాదించినా అంతకుమించి మంచితనంతో నలుగురికి దగ్గరవ్వాలన్న ఆలోచన వీళ్లకు ఉంది. అందుకే అప్పుడప్పుడు ఆపన్నులను ఆదుకునేందుకు - అనాధలతో టైమ్ స్పెండ్ చేసేందుకు ఆసక్తి చూపిస్తుంటారు. అందాల సమంత అయితే ప్రత్యూష పేరుతో ఓ సోషల్ వర్క్ ఆర్గనైజేషన్ ని రన్ చేస్తోంది. శ్రుతిహాసన్ అప్పుడప్పుడు చెన్నయ్ లో ఇలాంటి కార్యక్రమాలు చేస్తుంటుంది. మంచి మనసున్న ఈ మారాణమ్మలు ఇంకా తమ మనసులో ఏం ఉందో ఇలా చెప్పుకొచ్చారు.
సమంత మరో మంచి మాట చెబుతూ .. ఇతరులకు సాయం చేయాలంటే డబ్బు అవసరం. కానీ ఏ డబ్బుతో పనిలేకుండా చేసే సాయం అవయవదానం. అందుకు నేను ఎల్లపుడూ సిద్ధమే. ఇప్పటికే నా ఆర్గాన్స్ ని డొనేట్ చేసేశాను అని చెప్పింది. మరణించిన తర్వాత కూడా మనం జీవించే ఉండాలి అంటే అవయవాల్ని దానం చేయాలి అంటూ చెప్పింది. ఎంత మంచి మాట. నలుగురికి ఆదర్శమైన మాట. ఇక పోతే శ్రుతిహాసన్ మరో మంచి మాట చెప్పింది. సమాజానికి వీలున్నంత వరకూ సాయం చేసేందుకు నేనెప్పుడూ సిద్ధమే. అయితే ముందుగా నన్ను నేను పూర్తిగా నిరూపించుకున్నాక పూర్తి స్థాయిలో మంచి పనులకు శ్రీకారం చుడతాను.. అని చెప్పింది. బాగానే ఉంది అమ్మణ్ణుల ఆలోచన. చెట్లు పుట్టల చుట్టూ తిరుగుతూ డ్యూయెట్లు వేసుకోవడమే కాదు. అప్పుడప్పుడు ఇలాంటి మంచి ఆలోచనలు చేస్తుండడం మెచ్చాల్సిందే. ఊరికే సంపాదనకే పరిమితమైతే మనిషికి గొడ్డుకు తేడా ఏటుంటాది? అని అర్థమైందన్నమాట!