ఈ సారైనా బ్రేక్ వస్తుందా??

Update: 2016-12-06 04:32 GMT
సౌత్ లో హిట్టైన ప్రతీ హీరోయిన్ కి బాలీవుడ్ డ్రీమ్స్ ఉన్నాయ్. ఆఫర్ వస్తే ఎందుకు వదులుకుంటాం అని కొందరంటే.. బాలీవుడ్ లో కూడా ప్రూవ్ చేసుకుంటాం మా టార్గెట్ అదే అనే ఓపెన్ గా హింట్స్ ఇస్తుంటారు ఇంకొందరు. శృతీహాసన్ ఈ టైపే. తెలుగు.. తమిళ్ లో ఆఫర్స్ అండ్ హిట్స్ వస్తున్నా.. ముందు నుంచీ బాలీవుడ్ హీరోయిన్ అనిపించుకోవాలన్న కోరిక గట్టిగానే ఉంది కమల్ కూతురికి. అందుకే ఛాన్స్ ఎలాంటిదైనా ముంబైలో వాలిపోతుంది.

లక్ అంటూ బాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చినప్పటికీ ఇప్పటి వరకు అక్కడ లక్కీ హీరోయిన్ అనిపించుకోలేకపోయింది శృతీహాసన్. అందంలో శృతీకి తిరుగులేదు. హిందీ హీరోయిన్స్ కి ధీటుగా గ్లామర్ చూపించే తెగువ ఉంది. అక్షయ్ కుమార్ లాంటి పెద్ద హీరోల పక్కన యాక్ట్ చేసింది కూడా.. కానీ అదృష్టం మాత్రం కలిసి రావట్లేదు. మన దగ్గర గోల్డెన్ లెగ్ అనిపించుకున్నా శృతీ బాలీవుడ్లో ఆ మ్యాజిక్ చూపించలేకపోతుంది. అయినా ఎక్కడా తగ్గట్లేదు శృతీ. ఇప్పుడు మరో అవకాశం దక్కించుకోంది.

నేషనల్ అవార్డ్ విన్నర్ రాజ్ కుమార్ రావ్ పక్కన బెహన్ హోగీ తేరీ మూవీలో యాక్ట్ చేస్తోంది. అజయ్ పాన్ వాలా అని కొత్త డైరెక్టర్ తీస్తోన్న ఈ రొమాంటిక్ కామెడీ ఎంటర్ టైనర్ తో బ్రేక్ వస్తుందని నమ్ముతోంది శృతీ. వర్క్ మోడ్.. ఫన్ అంటూ తన సోషల్ మీడియా పేజీల్లో ఫస్ట్ డే షూటింగ్ డిటైల్స్ ని పోస్ట్ చేసింది కూడా. మరి బేహన్ హోగీ తేరీ అంటోన్న శృతీ డ్రీమ్ గాళ్ గా మారుతుందా..? ఈ మూవీతో అయినా బాలీవుడ్లో పాగా వేస్తుందా చూడాలి.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News