2018-19 సీజన్ లో స్టార్ డాటర్ శృతి హాసన్ పూర్తిగా తెరమరుగైన సంగతి తెలిసిందే. గబ్బర్ సింగ్, శ్రీమంతుడు లాంటి బ్లాక్ బస్టర్ చిత్రాల్లో నటించిన శృతిహాసన్ సడెన్ గా మాయమవ్వడం వెనక కారణాలపై టాలీవుడ్ లో ఆసక్తికర చర్చ సాగింది. 'వృత్తిగత జీవితం ఒక్కటే కాదు.. వ్యక్తిగత జీవితం చాలా ఇంపార్టెంట్' అంటూ స్టేట్ మెంట్ ఇవ్వడంతో శృతికి ఏమైంది? ఉన్నట్టుండి రూటు మార్చింది? అంటూ ఆసక్తిగా మాట్లాడుకున్నారు. ఓవైపు సౌత్ లో మరోవైపు బాలీవుడ్ లో వరుస విజయాలతో స్టార్ హీరోయిన్ స్టాటస్ అందుకున్న సమయంలో శృతి ఇలాంటి నిర్ణయం తీసుకోవడానికి కారణమేంటి? అన్న ఆసక్తికర చర్చ సాగింది.
ఆ తర్వాత ఊహించని ట్విస్టులెన్నో. వన్ ఫైన్ డే విదేశీ బోయ్ ఫ్రెండ్ మైఖేల్ కోర్సలే తో ప్రేమలో ఉన్నానని శృతి హాసన్ అధికారికంగానే ప్రకటించింది. మైఖేల్ ని నేరుగా మామ్ సారికకు, డాడ్ కమల్ హాసన్ కి పరిచయం చేసింది శృతి. చెన్నయ్ లో జరిగిన పలు ఈవెంట్లలో కమల్ హాసన్ తో పాటు ఒకే వరుసలో పంచెకట్టు శ్రీమంతుడిలా ఫోటోలకు ఫోజులిచ్చి సెలబ్రేషన్ మూడ్ లో కనిపించాడు మైఖేల్. ఆ తర్వాత ముంబైలో శృతి- మైఖేల్ జంట సొంతంగా ఓ ఇల్లు కొనుక్కుని సహజీవనం చేయడంపైనా బాలీవుడ్ మీడియా పలు కథనాల్ని వండి వార్చింది. అటుపై శృతి మహేష్ మంజ్రేకర్ దర్శకత్వంలో ఓ సినిమాకి సంతకం చేయడంతో ఇక కెరీర్ పరంగా బిజీ అయిపోతుందనే భావించారు. కానీ అనూహ్యంగా ఈ భామ యూటర్న్ తీసుకుంది. తనకు సంగీతంపై ఉన్న పిచ్చి ప్రేమ వల్ల తాను ఒక మ్యూజిక్ బ్యాండ్ ట్రూప్ తో కలిసి విదేశాల్లో లైవ్ షోలు చేయాలని నిర్ణయించుకుందని వార్తలు వచ్చాయి.
ఎట్టకేలకు శృతి తన మనసులో ఏం ఉందో బయటపెట్టింది. తనలో ఉన్న ఎమోషన్ ని సూటిగా రివీల్ చేసింది. 'కొన్ని విషయాల గురించి మనసులో నిత్యం అనుకుంటూనే ఉంటాం. ఎప్పటికోగానీ మనం అనుకున్నవి జరగవు. అలా చాన్నాళ్లుగా నేను మనసులో తలచుకున్న ఓ అంశం ఇప్పుడు నిజమైంది' అంటూ సోషల్ మీడియాలో వేదాంతం వల్లించింది. 'మానసికంగా నేను చాలా సంతోషంగా ఉన్నాను. ఇంత అందమైన జీవితం దక్కడం భగవంతుడి దయగా భావిస్తున్నానని సంపూర్ణమైన అవగాహనతో చెప్పాలనుకున్నా. ఇప్పటికి చెప్పగలుగుతున్నందుకు ఆనందంగా ఉంది. నేను ప్రస్తుతం గడుపుతున్న రోజులన్నీ అలాంటివే' అంటూ తన మనసుని బయటపెట్టింది. వృత్తిగత జీవితంలో ఉన్న ఆనందం కంటే వ్యక్తిగత జీవితంలో ఉన్న స్వేచ్ఛ ఎంతో గొప్పది అని శృతి చెప్పకనే చెప్పింది.