యూనివర్శిల్ స్టార్ కమల్ హాసన్ నట వారసురాలిగా ఎంట్రీ ఇచ్చిన శృతి హాసన్ మల్టీ ట్యాలెంటెడ్ అనిపించుకుంటూ ఇండస్ట్రీలో దూసుకు పోతున్న విషయం తెల్సిందే. ఒక్క భాష కు పరిమితం అవ్వకుండా.. కేవలం సినిమా లే అన్నట్లుగా పరిమితం అవ్వకుండా పాన్ ఇండియా రేంజ్ లో అన్ని భాషల్లో సినిమాల్లో నటించడంతో పాటు ఓటీటీ ల్లో కూడా నటిస్తూ ఉంది.
శృతి హాసన్ ఒక స్టార్ కూతురు అయినా కూడా తన తండ్రి వారసత్వం ను ఎక్కడ కూడా ఉపయోగించుకోవాలని అనుకోదు. తండ్రి కి తన మద్దతు ఇచ్చేందుకు ముందుకు వస్తుంది కాని ఆమె ఎప్పుడు కూడా తండ్రి నుండి సహకారం కావాలని కోరుకోదు.. అంతటి ఇండిపెండెంట్ అమ్మాయి అయిన శృతి హాసన్ తన వ్యక్తిగత విషయం లో కూడా తల్లిదండ్రుల నిర్ణయంతో సంబంధం లేకుండా సొంత నిర్ణయాలు తీసుకుంటుంది.
హీరోయిన్ గా ప్రతి సినిమాను కూడా ఆమె సొంత నిర్ణయంగా ఎంపిక చేసుకుంటున్న శృతి హాసన్ ఇప్పుడు ప్రేమ జీవితంలో కూడా సొంత నిర్ణయాన్ని అనుసరించి వెళ్తుంది.
తాపీగా హ్యాపీగా జీవితాన్ని సాగిస్తున్న శృతి హాసన్ అనూహ్యంగా తన అనారోగ్య సమస్యల గురించి చెప్పి అందరిని ఆశ్చర్యానికి గురి చేసింది. హార్మోన్ లోపం కారణంగా తాను ఇబ్బంది పడుతున్నట్లుగా శృతి హాసన్ చెప్పుకొచ్చింది.
ఇన్ స్టా గ్రామ్ లో శృతి హాసన్ ఒక వర్కౌట్ వీడియోను షేర్ చేసి ఆ వీడియో తో పాటు తన అనారోగ్య సమస్యలను వెళ్లడించింది. నాలా మీరు వర్కౌట్స్ చేయండి. ప్రస్తుతం నేను పాలిసిస్టిక్ ఓవరీ సిండ్రోమ్.. ఎండోమెట్రియోసిస్ వంటి పలు హార్మోన్ సమస్యలను ఎదుర్కొంటున్నాను. వాటి వల్ల జీవక్రియ సరిగా ఉండక పోవడంతో పాటు ఉబ్బరంగా ఉంటుంది.
ఇలాంటి సమస్యలు ఉన్నప్పుడు ఎంత ఇబ్బందిగా ఉంటుందో మహిళలకు తెలుసు. అందుకే ప్రతి ఒక్కరు కూడా రెగ్యులర్ గా వర్కౌట్స్ చేయాలి. ప్రతి రోజు మినిమం గా వర్కౌట్స్ చేయడం ద్వారా మంచి ఆరోగ్యం దక్కుతుంది. నా శారీరక ఆరోగ్యం సరిగా లేదు కాని నా మనసు చాలా ప్రశాంతంగా ఉండటం వల్ల నేను సంతోషంగా ఉంటున్నాను అంది.