బాలీవుడ్ నుంచి టాలీవుడ్ దాకా ఎక్కడ చూసుకున్నా హీరోలకు ఉన్నంత కెరీర్ హీరోయిన్లకు ముమ్మాటికీ ఉండదు. దానికి కారణం వయసు పెరిగే కొద్దీ తగ్గే గ్లామర్ ప్లస్ కొత్త తరం టీనేజ్ హీరోయిన్లు. ఇది ఎప్పటి నుంచో ఉంది కానీ ఇప్పుడు మాత్రం బాగా ముదిరిపోయింది. అందుకే ఎంత సీనియర్ హీరోయిన్లైనా టాప్ రేంజ్ కి చేరుకున్న తర్వాత మహా అయితే ఐదు లేదా ఎనిమిదేళ్ల కంటే ఎక్కువ స్క్రీన్ మీద వెలగలేకపోతున్నారు. ఇప్పుడు శృతి హాసన్ వంతు వచ్చినట్టు కనిపిస్తోంది. గత ఏడాది పవన్ కళ్యాణ్ కాటమ రాయుడులో కనిపించినప్పుడు లుక్స్ పరంగా విమర్శలు అందుకున్న శృతి హాసన్ గబ్బర్ సింగ్ టైంలో వరసబెట్టి స్టార్ హీరోలతో బ్లాక్ బస్టర్స్ హిట్స్ కొట్టిన సంగతి తెలిసిందే. కానీ ఇప్పుడు మాత్రం మునుపటి జోరు లేదు. విదేశీ ప్రియుడితో బయట మీడియా కెమెరాలకు సైతం ఏ మాత్రం మొహమాటం లేకుండా కనిపించిన శృతి తమిళ దర్శకుడు సుందర్ సి వందల కోట్లతో తీయాలన్న సంఘమిత్రను చేతులారా వదిలేసుకుంది. ఇప్పుడు మ్యూజిక్ ఆల్బమ్స్ చేస్తాను అంటోంది. అంటే హీరోయిన్ గా ఇక అవకాశాలు లేకనే కదా.
నిజానికి శృతి హాసన్ కు సౌత్ కంటే నార్త్ మీదే ప్రేమెక్కువ. కానీ అక్కడ ఏది చేసినా అమ్మడిని రిసీవ్ చేసుకోలేదు. ఎంతో మోజు పడి నువ్వొస్తానంటే నేనొద్దంటానా హిందీ రీమేక్ చేస్తే అక్కడివాళ్లు తిప్పి కొట్టారు. తర్వాత చేసినవి కూడా బోల్తా పడ్డాయి. సౌత్ లో దాదాపు అందరు అగ్ర హీరోలతో నటించిన శృతి కమల్ హాసన్ కూతురిగా కంటే హీరోయిన్ గా తన ఓన్ బ్రాండ్ ని సృష్టించుకుంది కాని దాన్ని ఎక్కువ కాలం నిలబెట్టుకోలేకపోయింది. కాజల్ అగర్వాల్ మరీ ఇంతగా కాదు కానీ ముందున్నంత జోరు అయితే లేదు. అందుకే బెల్లంకొండ సాయి శ్రీనివాస్ తో ఏకంగా రెండు సినిమాలకు ఓకే చెప్పింది. సైరా క్వీన్ రీమేక్ తో పాటు మరో రెండు సినిమాల్లో బిజీగా ఉన్న మిల్కీ బ్యూటీ తమన్నా తర్వాత ప్రాజెక్ట్స్ ఏవైనా వస్తాయేమో ఎదురు చూస్తోంది. కళ్యాణ్ రామ్ తో చేసిన నా నువ్వే ఘోరంగా దెబ్బ తినడం ఎఫెక్ట్ ఇచ్చింది. మరి వీళ్ళు శృతి బాటలో నడుస్తారా కాలమే నిర్ణయించాలి.