కథలు చెప్పడంలో నేను కేక

Update: 2016-02-13 07:13 GMT
కమల్ హాసన్ కూతురిగా తెరంగేట్రం చేసిన శృతిహాసన్.. తర్వాత సొంత ప్రతిభతోనే బోలెడంత గుర్తింపు సంపాదించింది. యాక్టర్ గానే కాకుండా సింగర్ - కంపోజర్ గాను ఆమెకు పేరు ఉంది. అంతే కాదు.. అప్పుడప్పుడూ ఈ చిన్నది కవితలు కూడా రాసేస్తుంటుంది. ఇలా తనలోని ఒక్కో కళను బయపెడతూ ఉంటుంది. మరి ఇన్ని ఉన్నపుడు కథలు రాసే ట్యాలెంట్ సంగతేంటి అంటే.. ఓ ఇంట్రెస్టింగ్ ఆన్సర్ ఇచ్చింది శృతి.

'కథలు రాయడానికైతే ఎప్పుడూ ట్రై చెయ్యలేదు కానీ.. చెప్పడం మాత్రం బాగా వచ్చు. పెద్దయ్యాక మానేశాను కానీ.. చిన్నపుడు బోలెడన్ని స్టోరీస్ చెప్పేదాన్ని. ఇంట్లో అమ్మకి ఓ స్టోరీ - స్కూల్ వెళ్లినపుడు టీచర్ కి ఓ స్టోరీ చెప్పేసేదాన్ని. అలాగే ఫ్రెండ్స్ కి అయితే మాయామంత్రాలు జోడించి మరీ కథలు చెప్పేదాన్ని. ఇంట్లో చెప్పిన కొన్ని కథలు సమస్యలు కూడా తెచ్చేవి. ఇప్పుడు మానేశాను లెండి ఇలాంటి కథలు' అంటూ నవ్వేసింది శృతిహాసన్.

ఇప్పుడైతే మాత్రం కథలు రాయాలంటే సినిమా కోసమే రాస్తుందట కానీ.. ఎప్పుడు రాస్తుందనే విషయం మాత్రం చెప్పలేదట ఈ భామ. ప్రస్తుతం తెలుగులో చైతూ సరసన మజ్నూ మూవీలో లెక్చరర్ నటిస్తున్న శృతికి.. కోలీవుడ్, బాలీవుడ్ లలో చాలానే ఆఫర్స్ ఉన్నాయి.
Tags:    

Similar News