శృతి హాసన్ రూటే సెపరేటు

Update: 2018-10-06 07:50 GMT
స్టార్ కిడ్స్ గా పుట్టడం లక్కీ అని చాలామంది అనుకుంటూ ఉంటారుగానీ అది కొంతవరకే నిజం.  వాళ్ళు ఎప్పటికైనా తమ తల్లిదండ్రుల కెరీర్ ఎంచుకుని సక్సెస్ అయితే జనాలు జేజేలు పలుకుతారు గానీ అదేమీ అంత సులువు కాదు.  మొదటి సినిమానుండి తల్లిదండ్రులతో పోలికలు వస్తాయి. ఒక చిన్న ఉదాహరణ తీసుకుంటే.. అభిషేక్ బచ్చన్ మంచి నటుడే కానీ ఇప్పటివరకూ అమితాబ్ నీడ నుండి బయటకు రాలేకపోయాడు. ఇక అభి లాంటి వారిని ట్రోల్ చేసేందుకు నెటిజనులు ఎప్పుడు రెడీ గా ఉంటారు.

కమల్ హాసన్ పెద్ద కూతురు శృతి హాసన్ సంగతి మాట్లాడుకుంటే.. మొదటి సినిమా బాలీవుడ్ లో చేసింది.. టైటిల్ 'లక్' కానీ  బడా  ఫ్లాప్. తర్వాత తమిళ తెలుగు భాషల్లో భారీ ప్రాజెక్టులలో అవకాశాలు వచ్చాయి గానీ దాదాపు అరడజను సినిమాలు ఫ్లాపులే.  దెబ్బతో ఆమెను ఐరన్ లెగ్గని.. నటన రాదని ట్రోల్ చేయడం మొదలు పెట్టారు.  పవన్ కళ్యాణ్ సినిమా 'గబ్బర్ సింగ్' ఆమె కెరీర్ కు పెద్ద బ్రేక్ ఇచ్చింది. అప్పటినుండి మళ్ళీ తెలుగు తమిళ హిందీ భాషలలో హిట్ సినిమాల్లో నటించి స్టార్ హీరోయిన్ ట్యాగ్ సాధించింది. ఇక అంతా స్మూత్ జర్నీ అనుకునే సమయం లో సుందర్. C డైరెక్షన్ లో తెరకెక్కనున్న భారీ ప్రాజెక్ట్ 'సంఘమిత్ర' నుండి తప్పు కోవడం తో వివాదం రేగింది.  అప్పటినుండి సినిమాలపై ఆసక్తి తగ్గడం.. వెయిట్ పెరగడం.. మైఖేల్ కోర్సాలే తో ప్రేమ ఇవన్నీ హీరోయిన్ కెరీర్ను దెబ్బ తీశాయి.

ఇప్పుడు అవన్నీ పట్టించుకోకుండా సింగింగ్ కెరీర్ పై ఫోకస్ చేసింది. పాటలు రాయడం పాడడం తన కెరీర్ అంటోంది.. లండన్ లో ఇప్పటికే ఒక లైఫ్ పెర్ఫార్మన్స్ ఇచ్చింది కూడా.  ఇండో మ్యూజిక్ ప్రొడ్యూసర్ న్యూక్లియస్ తో కలిసి మ్యూజిక్ ఆల్బమ్ రిలీజ్ చేయడానికి రెడీ అవుతోంది.  మరి ఫ్యూచర్ లో ఇంటర్నేషనల్ సింగర్ గా పేరు తెచ్చుకోవడం ధ్యేయమని చెబుతోంది.  అన్నట్టు శృతి సింగింగ్ టాలెంట్ గురించి మీకు తెలుసో లేదో 1999 లో రిలీజ్ అయిన కమల్ హాసన్ సినిమా 'దేవర మగన్' లో ఒక పాట పాడింది. అంత చిన్నవయసు నుండే ఆమె పాటలు పాడడం మొదలు పెట్టింది. చూద్దాం.. కమల్ యూనివర్సల్ యాక్టర్ అయినట్టే కూతురు యూనివర్సల్ సింగర్ గా పేరు తెచ్చుకోవాలని  ఆశిద్దాం.
Tags:    

Similar News