యూనివర్శిల్ స్టార్ కమల్ హాసన్ కూతురు శృతిహాసన్ చాలా పాశ్చాత్య పోకడలు కలిగి ఉన్న అమ్మాయిగా అనిపిస్తుంది. స్వతంత్ర భావాలు కలిగి ఉండటంతో పాటు ఒకరిపై ఆధారపడాలనే తత్వం ఆమెకు అస్సలు ఉండదు. తండ్రి పేరుతో ఆమె కెరీర్ మొదలు పెట్టినా కూడా ఆమె తనకంటూ ప్రత్యేక గుర్తింపును సొంతంగానే కష్టపడి సంపాదించుకుంది. అలాంటి శృతిహాసన్ ఇటీవల ఒక ఇంటర్వ్యూలో తన తల్లిదండ్రులు విడిపోవడంపై స్పందిస్తూ ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది.
నా తల్లిదండ్రులు కలిసి ఉన్న సమయంలో ఎదుర్కొన్న సమస్యలను నేను ప్రత్యక్షంగా చూశాను. ఇద్దరు కూడా ఆర్టిస్టులే అవ్వడంతో ఇద్దరు కూడా కొన్ని విషయాల్లో విభేదించుకునే వారు. ఇద్దరి మద్య గొడవలు ఎక్కువ అవుతున్న సమయంలో విడిపోయారు. వారిని కలిపేందుకు ప్రయత్నించాలనుకున్నాను. కాని వారు కలిసినా కూడా గొడవ పడుతారని.. ఇద్దరి జీవితాల్లో మనశ్శాంతి కోల్పోతారనే ఉద్దేశ్యంతో తాను ఆ ప్రయత్నం చేయలేదు అంది.
నా ఉద్దేశ్యం ప్రకారం అమ్మా నాన్న విడిపోయి విడి విడిగా సంతోషకరమైన జీవితంను గడుపుతున్నారు. ఆ సమయంలో వారు విడిపోవడం మంచిదే. ఒకవేళ వారు విడిపోయి ఉండక పోతే ఇద్దరు కూడా తీవ్రమైన ఇబ్బందులు పడేవారు. అమ్మానాన్న విడిపోవడం నాకు ఇబ్బందిని కలిగించినా కూడా నా ఆనందం కోసం వారిని కలిసి ఉండాలని కోరుకోవడం ఏమాత్రం కరెక్ట్ కాదనిపించింది. అమ్మా నాన్నలతో నేను చెల్లి సంతోషం గా ఉన్నాము. వారిద్దరు కూడా ఎవరికి వారు జీవిస్తూ సంతోషంగా జీవితాన్ని లీడ్ చేస్తున్నారని శృతి హాసన్ పేర్కొంది.