మరిచిపోకండి.. నేను కమల్ కూతుర్ని

Update: 2016-10-14 05:30 GMT
నయనతార లాంటి గ్లామరస్ హీరోయిన్.. ఎన్నో కాంట్రవర్శీలు ముడిపడ్డ అమ్మాయి ‘శ్రీరామరాజ్యం’లో సీత పాత్ర పోషించినా ప్రేక్షకులు యాక్సెప్ట్ చేశారు. ముందు కొంచెం సందేహాలు వ్యక్తం చేసినా.. ఆమెను సీత లుక్ లో చూడగానే అభిప్రాయాలు మార్చుకున్నారు. అలాంటిది ‘ప్రేమమ్’ మలయాళ వెర్షన్లో సాయి పల్లవి చేసిన క్యారెక్టర్ని తెలుగులో శ్రుతి హాసన్ చేస్తోందనగానే ఎందుకంత వ్యతిరేకత వచ్చిందో అర్థం కాలేదు. ‘ప్రేమమ్’ మీద.. సాయి పల్లవి మీద ఎంత ప్రేమైనా ఉండొచ్చు కాక.. కానీ ఆ సినిమాను రీమేక్ చేయడమే పెద్ద పాపం అన్నట్లుగా వ్యతిరేక ప్రచారం చేయడం.. అందులోనూ శ్రుతిని టార్గెట్ చేస్తూ ట్రోల్ చేయడం అన్నది విడ్డూరమైన విషయం. ఇలా చేసినోళ్లందరికీ తెలుగు ‘ప్రేమమ్’ గట్టిగానే సమాధానం చెప్పింది. ఈ సినిమా సూపర్ హిట్ టాక్‌ తో దూసుకెళ్తుండటమే కాదు.. శ్రుతి నటనకు కూడా ప్రశంసలు దక్కుతున్నాయి.

ఐతే అప్పట్లో సోషల్ మీడియాలో జరిగిన ట్రోలింగ్ విషయంలో శ్రుతి హాసన్ ఫ్యాన్స్ ఫీలైనా.. ఆమె మాత్రం చాలా లైట్ తీసుకుందట. ఆ సంగతి అస్సలు పట్టించుకోలేదట. ‘‘నేను కమల్ హాసన్ కూతురినన్న సంగతి మరిచిపోతున్నారు. ఇలాంటి విషయాలు నన్ను పెద్దగా బాధ పెట్టవు. చాలా లైట్ తీసుకుంటాను. ఈ ట్రోలింగ్ సంగతి సీరియస్ గా తీసుకోకుండా ఆ పాత్రను ఎలా పండించాలని మాత్రమే ఆలోచించాను. మలార్ పాత్రను నా శైలిలో ఎలా చేయాలని మాత్రమే ఆలోచించాను. నా టచ్ ఇచ్చాను. నేను.. దర్శకుడు చందూ మొండేటి ఈ పాత్ర విషయంలో కొన్ని చర్చలు జరిపాం. నా పాత్ర డామినేటింగ్ గా ఉండాలని.. సహజంగా ఉండాలని అనుకున్నాం. ఈ క్యారెక్టర్ కోసం చాలా తక్కువ మేకప్ వేసుకున్నా. తెలుగు ప్రేక్షకుల అభిరుచికి తగ్గట్లుగా నటించా. ఇది రీమేక్ అయినా సరే చందూ మొండేటి తనదైన టచ్ ఇచ్చాడు. ఎంటర్టైన్మెంట్ పెంచాడు. అద్భుతంగా తీర్చిదిద్దాడు’’ అని శ్రుతి చెప్పింది.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News