ఒక్కో సినిమాకు కోటికి తక్కువ కాకుండా పారితోషకం పుచ్చుకునే భామ శ్రుతి హాసన్. ఆమె తండ్రి కమల్ హాసన్ రేంజేంటో తెలిసిందే కాబట్టి చిన్నప్పట్నుంచి కూడా లగ్జీరియస్ లైఫే గడిపి ఉంటుంది శ్రుతి హాసన్. అలాంటపుడు శ్రుతి వాడే ప్రతి వస్తూ బ్రాండెడే అయి ఉంటుందని.. అవి కూడా చాలా ఖరీదైనవి అయి ఉంటాయని అనుకుంటాం. ఆమె బ్రాండ్ ఫ్రీక్ అని భావిస్తాం. కానీ శ్రుతి మాత్రం అలాంటిదేమీ లేదంటోంది. తనకు బ్రాండ్ల పిచ్చేమీ లేదని ఆమె తేల్చి చెప్పింది. తాను తనకు నచ్చిన దుస్తులు ఎంత తక్కువ రేటువైనా.. బ్రాండ్ కాకపోయినా ఆలోచించనని అంటోంది. ఒకవేళ బ్రాండెడ్ దుస్తులు కొన్నా డిస్కౌంట్ సేల్ లో కొనడం తనకు అలవాటని శ్రుతి ఆశ్చర్యకరమైన విషయం చెప్పింది.
మామూలుగా మిడిల్ క్లాస్ జనాలు డిస్కౌంట్ సేల్ కోసం చూస్తుంటారు. అవి పెట్టినపుడు తమకు నచ్చిన బ్రాండెడ్ దుస్తుల్ని డిస్కౌంట్ లో కొంటుంటారు. మరి శ్రుతి ఆర్థికంగా గొప్ప స్థాయిలో ఉన్నప్పటికీ ఇలా డిస్కౌంట్ సేల్ లో బట్టలు కొనడమేంటా అని అందరూ ఆశ్చర్యపోతున్నారు. తాను తన శరీరానికి నప్పే దుస్తుల గురించి ఆలోచిస్తా తప్ప.. బ్రాండెడే అయ్యుండాలని ఎప్పుడూ పట్టుబట్టి కూర్చోనని శ్రుతి తెలిపింది. నిజానికి పెద్ద పెద్ద బ్రాండ్స్.. డిజైనర్ డ్రెస్సులు వేసుకోవడం తనకు ఇష్టముండదని.. వాటిపై పెద్దగా ఖర్చు పెట్టనని.. ఒకవేళ తాను అలాంటి డ్రెస్సులు వేసినా అవి ఎవరైనా బహుమతిగా ఇచ్చినవే అయి ఉంటాయని శ్రుతి తెలిపింది. రిచ్ గా కనిపించాలంటే బ్రాండెడ్ దుస్తులే వేసుకోవాల్సిన పని లేదని.. బాడీకి సూటయ్యే కలర్-కాంబినేషన్ ఉంటే ఏ డ్రెస్సయినా అందంగా ఉంటుందని శ్రుతి సెలవిచ్చింది.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/