చాలా మంది పెద్దవాళ్ల దగ్గర కూర్చున్నప్పుడు ఏదైనా టాపిక్ వస్తే... "ఏది ఏమైనా ఆ రోజులే వేరండీ" అనడం రెగ్యులర్ గా వింటుంటాం! అవును... నేటికంటే నిన్న బాగున్నట్లు గా చాలా మంది చెబుతుంటారు.. ఇదే విషయాలను తనదైన శైలిలో చెబుతుంది హాట్ హీరోయిన్ శృతి హాసన్. కాకపోతే ఆమె చెప్పే విషయాలు మరోటో, ఇంకోటో కాదు... "శృంగారం" గురించి! అవును... అప్పట్లో శృంగారం - అది పుట్టే సందర్భాలు, సమయాలు చాలా ఆసక్తికరంగా ఉండేవని తన యౌవ్వన కాల అనుభవాలను తాజాగా పంచుకుంది.
తాజాగా "శృంగారం.. కాలం తెచ్చిన మార్పు" అనే అంశంపై మాట్లాడిన శృతి ఈ విషయంలో తన అభిప్రాయాలను ఓపెన్ గా చెప్పుకొచ్చింది. నేటి రొమాన్స్ లో నాటి మజా దొరకడం లేదని - ఈ స్పీడు యుగంలోని చిలిపి పనుల్లో నాటి చతురత ఏమాత్రం కనిపించడం లేదని తేల్చి పడేసింది. ఈ విషయంలో తన టీనేజి నాటి రోజులకు ముడిపెట్టి నేటి యువత విషయాలు, శృంగార విషయాలు శృతి మాట్లాడింది.
ఆమె టీనేజ్ లో చూసిన / సాగిన ప్రేమాయాణాల్లో ఎంత ఉద్వేగం ఉండేదని, దానికి కారణం అవన్నీ ఎంతో రహస్యంగా, భయపడుతూ సాగడమేనని చాలా మంది ఒప్పుకునే విషయాన్ని చెప్పింది శృతి. అప్పట్లో ప్రేమించిన వ్యక్తితో మాట్లాడటమనేది చాలా పెద్ద విషయమని, ల్యాండ్ ఫోన్ రోజుల్లో ఇద్దరు యువతీ యువకులు మాట్లాడుకోవాలంటే "రాసిపెట్టి ఉండాలండీ" అని చెప్పుకొచ్చింది. ప్రేమికుడు ఎప్పుడు ఫోన్ చేస్తాడా అని ఎదురుచూడటంలోనూ, తామే ఫోన్ చేస్తే అతడే తీస్తాడా లేక ఇంట్లోవాళ్లు తీస్తారా అనే ఆందోళనలోనూ అద్భుతమైన ఆనందం దాగి ఉందని వివరించింది.
ఇక మొబైల్ ఫోన్లు వచ్చిన తర్వాత ప్రత్యేకంగా చెప్పేదేముంది.. అంటూ పెదవి విరుస్తుంది. ఇదే క్రమంలో ఇష్టపడగానే ఇన్ స్టంట్ రొమాన్స్ స్టార్ట్ అయిపోతున్న రోజులు ఇవని, అందుకే దాని విలువ నేటి తరానికి తెలియడం లేదని తన అనుభవాలను రంగరించి చెప్పుకొచ్చింది శృతి!