హీరోయిన్లకు ‘ఐలవ్యూ’ చెప్పేవాళ్లు లక్షల్లో ఉంటారు. వాటన్నింటినీ పట్టించుకుంటే చాలా కష్టం. ఐతే హీరోయిన్ అయ్యాక లైట్ తీసుకుంటారు కానీ.. ఆ సెలబ్రెటీ స్టేటస్ రాకముందు ఇలాంటి ప్రపోజల్స్ వస్తే ఎవరైనా ఏం చేస్తారు? వేరే వాళ్ల సంగతేమో కానీ.. శ్రుతి హాసన్ మాత్రం తాను ఆ విషయాన్ని అంత తేలిగ్గా తీసుకోలేదని చెబుతోంది. తన స్నేహితుడు ప్రేమికుల రోజు నాడు తనకు లవ్ ప్రపోజల్ చెబితే ఏం చేశానో.. ఓ టీవీ ఛానెల్లో వివరించింది శ్రుతి.
‘‘టీనేజీలో ఉండగా ఓ స్నేహితుడు ప్రేమికుల రోజు సందర్భంగా వచ్చి లవ్ ప్రపోజ్ చేశాడు. ఊహించని ఆ పరిణామానికి షాకైపోయాను. ఐతే వెంటనే తేరుకుని అతని చెంప చెళ్లుమనిపించాను. ఐతే పెళ్లి చేసుకునే వయసు వచ్చాక నాకెవ్వరూ లవ్ ప్రపోజ్ చేయలేదు. అందువల్ల నేనూ ఎవరికీ పెళ్లి ప్రపోజల్ చేయలేదు. కోస్టార్లతో ఎఫైర్లకు సంబంధించి రూమర్ల మీద స్పందించడం బోరింగా అనిపిస్తోంది’’ అని శ్రుతి చెప్పింది. ఇంతకు ముందు పెళ్లి మీద పెద్దగా ఆసక్తి లేదన్న శ్రుతి.. ఇప్పుడు కొత్తగా మాట్లాడుతోంది. తనకిప్పుడు వెంటనే పెళ్లి చేసుకోవాలని, ఆదర్శ తల్లి కావాలని కోరికగా ఉందని చెప్పింది శ్రుతి.
తన ఫ్యామిలీ గురించి మాట్లాడుతూ.. ‘‘మా నాన్న గురించి కొత్తగా చెప్పేదేముంది. ఇక మా అమ్మ సారిక.. 20 ఏళ్ల క్రితమే పర్జానియా సినిమాకు జాతీయ అవార్డును అందుకున్న నటి ఆమె. నాన్న కమలహాసన్, చెల్లెలు అక్షరలతో కలిసి నటించాలన్న కోరిక నాకు బలంగా ఉంది. అక్షరను నేనెప్పుడూ పోటీగా భావించను. తను నా చెల్లెలు. నా కళ్ల ఎదుట పెరిగింది. సినిమాలో ఎవరి స్థానం వారికి ఉంటుంది’’ అని చెప్పింది.