రంగుల ప్ర‌పంచంలో క‌థానాయిక‌ల ప‌ర్స‌న‌ల్ లైఫ్ ఇంతేనా..!

Update: 2021-07-12 07:30 GMT
రంగుల ప్ర‌పంచంలో అగ్ర క‌థానాయిక‌లుగా ఓ వెలుగు వెలుగుతున్న చాలామంది క‌థానాయిక‌ల వ్య‌క్తిగ‌త జీవితం ప్ర‌తిసారీ చ‌ర్చ‌నీయాంశ‌మే. ప్రేమ.. పెళ్లి .. సంసార జీవ‌నం వ‌గైరా వ్య‌క్తిగ‌త విష‌యాలు చాలామందికి సంక్లిష్ఠంగా మారే స‌న్నివేశం క‌నిపిస్తోంది. పూరి త‌న మ్యూజింగ్స్ లో చెప్పిన‌ట్టు పెళ్లితో ఇన్ని బాధ‌లు దేనికి..?  పెళ్లాడ‌ని వాళ్లే గొప్ప‌.. అని భావించాల్సిన ప‌రిస్థితి ఉంది.

స‌మంత .. శ్రీయ‌.. ప్రియాంక చోప్రా.. న‌జ్రియా న‌జీమ్.. కాజ‌ల్ లా అంద‌రికీ వీలుప‌డ‌దు. త్రిష‌.. మెహ్రీన్.. ర‌ష్మిక‌ లా నిశ్చితార్థం త‌ర్వాత పెళ్లి క్యాన్సిలేష‌న్ కి వెళ్ల‌డం బ‌య‌ట‌ప‌డుతూనే ఉంది. ఇక ల‌వ్ లైఫ్ ఫెయిలైన వారికి కొద‌వే లేదు. ఇలియానా.. శ్రుతిహాస‌న్ ల‌వ్ లైఫ్ లో ఫెయిలైన భామ‌లుగానే సుప‌రిచితం. కెరీర్ ప‌ర‌మైన విష‌యాల‌కు ఆఫ‌ర్ట్ మ్యారేజ్ అవ‌కాశం లేక‌పోతే ఇలాంటి ప‌రిస్థితి ఎదుర‌వుతోంది. ఇంత‌కుముందు అమ‌లాపాల్ సైతం పెళ్లి త‌ర్వాత విడాకులు ఇవ్వ‌డానికి కెరీర్ డైల‌మానే ప్ర‌ధాన‌ కార‌ణం. ఇక ర‌ష్మిక మంద‌న త‌న కెరీర్ కోసం ఏకంగా ల‌వ్ లైఫ్ నే త్యాగం చేసింది. ప్రేమించిన ర‌క్షిత్ తో నిశ్చితార్థం అయ్యాక పెళ్లి క్యాన్సిల్ చేయ‌డం చ‌ర్చ‌నీయాంశ‌మైంది.

ఇక‌పోతే ఇటీవ‌ల శ్రుతిహాస‌న్ మైఖేల్ కోర్స‌లే నుండి విడిపోయాక‌ రెండో సారి ప్రేమ‌లో ప‌డిన సంగ‌తి తెలిసిందే. డూడుల్ ఆర్టిస్ట్ శంత‌నుతో నిండా ప్రేమ‌లో ఉన్న ఈ బ్యూటీ ప్ర‌స్తుతం జంట ఫోటోల‌ను షేర్ చేస్తుంటే అవి అంత‌ర్జాలంలో వైర‌ల్ గా మారుతున్నాయి. అయితే శ్రుతి త‌న ఇష్ఠ స‌ఖుడు శంత‌నుని పెళ్లాడుతుందా? అంటే అందుకు ఇప్ప‌ట్లో ఆస్కారం లేద‌నే చెబుతున్నారు. శ్రుతి ఓ వైపు బ్యాక్ టు బ్యాక్ ప్రాజెక్టుల‌కు క‌మిట‌వుతూ కెరీర్ ప‌రంగా బిజీగా ఉంది. డార్లింగ్ ప్ర‌భాస్ స‌ర‌స‌న స‌లార్ చిత్రానికి క‌మిటైన ఈ బ్యూటీ త‌మిళంలో ఇత‌ర ప్రాజెక్టుల‌తో బిజీగా ఉంది. తెలుగులో ప‌లువురు అగ్ర హీరోల స‌ర‌స‌న న‌టించేందుకు స‌న్నాహ‌కాల్లో ఉంద‌ని స‌మాచారం. అటు హిందీలోనూ ద‌ర్శ‌క‌నిర్మాత‌ల‌తో మంత‌నాలు సాగిస్తోంది. అందుకే ఈ బిజీ లైఫ్ లో పెళ్లి అనే మాట‌కు ఇప్ప‌ట్లో ఆస్కారం లేద‌ని తెలుస్తోంది.

ఒక ర‌కంగా అందాల న‌య‌న‌తార త‌ర‌హాలోనే ప్రియుడితో షికార్లు స‌హజీవ‌నం ప్ర‌తిదీ ఓపెన్ గానే.. పెళ్లి స‌హా ఇత‌ర వ్య‌వ‌హారాల‌పై మాట్లాడేందుకు శ్రుతిహాస‌న్ ఆస‌క్తిగా లేదు. కెరీర్ పైనే త‌న దృష్టంతా. న‌య‌న్ రెండు సార్లు ప్రేమ‌లో విఫ‌ల‌మై మూడోసారి ద‌ర్శ‌కుడు విఘ్నేష్ శివ‌న్ తో ప్రేమ‌లో ప‌డిన సంగ‌తి తెలిసిందే. ఇక పెళ్లి పేరుతో కెరీర్ ని వ‌దులుకునేందుకు న‌య‌న్ ఆస‌క్తిగా లేదు. ఇప్పుడు అదే బాట‌లో శ్రుతిహాస‌న్ కూడా పెళ్లిని వ్య‌తిరేకిస్తున్నార‌ని గుస‌గుస‌లు వినిపిస్తున్నాయి. చాలామంది అగ్ర క‌థానాయిక‌లు పెళ్లి మ్యాట‌ర్ లో అంత ఆస‌క్తిగా లేక‌పోవ‌డానికి కార‌ణం కెరీర్ మ్యాట‌రేన‌న‌డంలో ఎలాంటి సందేహాలు లేవు.  స్టార్ హీరోయిన్ కాజ‌ల్ చాలా ఆల‌స్యంగా ఇటీవ‌లే త‌న స్నేహితుడు కం బిజినెస్ మేన్ గౌత‌మ్ ని పెళ్లాడారు.

ప‌రిశ్ర‌మ అగ్ర నాయిక అనుష్క శెట్టి పెళ్లి విష‌య‌మై ఇంకా డైల‌మా కొన‌సాగుతోంది.  కొంత‌కాలంగా కెరీర్ ప‌రంగా స్పీడ్ త‌గ్గించిన అనుష్కకు పెళ్లి సంబంధాలు చూస్తున్నారంటూ గుస‌గుస‌లు వినిపిస్తున్నాయి. ఇటీవ‌ల బ్యాక్ టు బ్యాక్ సినిమాల‌కు అంగీక‌రించేందుకు అనుష్క సిద్ధంగా లేక‌పోవ‌డంతో బోలెడన్ని సందేహాలు వ్య‌క్త‌మవుతున్నాయి. పెళ్లి మ్యాట‌ర్ లో ఛార్మిలాంటి సీనియ‌ర్ న‌టీమ‌ణి ఎందుక‌నో వ్య‌తిరేకంగానే ఉన్నారు. పూరితో క‌లిసి ఛార్మి సినిమాల‌ను నిర్మిస్తున్నారు. సినీనిర్మాత‌గా న‌టిగా కొన‌సాగుతున్నారు. ఇక కెరీర్ ప‌రంగా బిజీ లైఫ్ వ‌ల్ల వ్య‌క్తిగ‌త జీవితాన్ని కోల్పోతున్నామ‌ని భావించే క‌థానాయ‌క‌లు ప‌రిశ్ర‌మ‌లో లేక‌పోలేదు. వారంతా కొన్నాళ్లు బిజీ లైఫ్ కి బ్రేక్ ఇచ్చి సీక్రెట్ బోయ్ ఫ్రెండ్ తో షికార్లు చేయ‌డం చాలాసార్లు బ‌య‌ట‌ప‌డింది.
Tags:    

Similar News