అరుంధతి.. టాలీవుడ్ చరిత్రలో ఎప్పటికీ నిలిచి ఉండే సినిమా. సినిమాను ప్రాణంగా ప్రేమించే శ్యామ్ ప్రసాద్ రెడ్డి తెలుగు ప్రేక్షకులకు అందించిన గొప్ప కానుక ఈ సినిమా. ప్రేక్షకులు సైతం కలెక్షన్ల రూపంలో ఆయన రుణం తీర్చేసుకున్నారనుకోండి. ఐతే ఈ సినిమా మొదలవడం దగ్గర్నుంచి పూర్తయ్యే వరకు లెక్కలేనన్ని మలుపులున్నాయి.
తన బంధువులెవరో చెప్పిన గద్వాల్ సంస్థానానికి చెప్పిన చిన్న పాయింటును పట్టుకుని తన టీమ్ తో కలిసి స్వయంగా శ్యామ్ ప్రసాద్ రెడ్డే ఈ కథను తయారు చేయడం విశేషం. ఐతే ఈ సినిమాకు ముందు అనుకున్న హీరోయిన్ వేరు, దర్శకుడు వేరు, విలన్ వేరు. కానీ అనుకోని కారణాలతో అందరూ మారిపోయారు. ‘అరుంధతి’ పాత్ర కోసం చాలా చాలా ఆప్షన్స్ పరిశీలించారట శ్యామ్. ఐతే పొడవు ఉన్నవాళ్లకు నటన రాదు, నటన వచ్చినవాళ్లకు పర్సనాలిటీ లేదు. ఈ రెండు ఉన్న వాళ్లకు ఇంకేదో లోపం. ఇలా లీడ్ రోల్ చేసే నటి కోసం చాలా రోజులు ప్రయత్నించి.. చివరికి మమతా మోహన్ దాస్ ను ఎంచుకున్నారట శ్యామ్. కానీ సినిమా ఇక మొదలవుతుందనగా.. శ్యామ్ తో సినిమా అంటే ఏళ్లకు ఏళ్లు లాక్ అయిపోతావని ఎవరూ బెదరగొడితే మమత తప్పుకుందట. అప్పుడే ‘సూపర్’ భామ అనుష్క మీద శ్యామ్ కళ్లు పడ్డాయి. ‘విక్రమార్కుడు’ చేస్తుండగా అనుష్కను ‘అరుంధతి’ కోసం అడిగారు శ్యామ్. అనుష్క కంటే కూడా రాజమౌళి చాలా ఎగ్జైటైపోయి ఆమెతో ఓకే చేయించాడు.
విలన్ పాత్ర ‘పశుపతి’ కోసం ముందు తమిళ నటుడు పశుపతినే అనుకున్నాడట శ్యామ్. అతణ్ని దృష్టిలో ఉంచుకునే ఆ క్యారెక్టర్ కు పశుపతి అని పేరు పెట్టారట. ఐతే అఘోరా పాత్రకు అతను ఓకే కానీ.. మామూలు సన్నివేశాల్లో అతడి అవతారం సరిపోదని భావించి సోనూసూద్ ను ఎంచుకున్నాడు. అప్పటికే సోనూ సూపర్ సినిమాలో నటించాడు. ఇక దర్శకుడిగా ముందు అనుకున్నది తమిళ సీనియర్ డైరెక్టర్ సభాపతిని. ఐతే క్లైమాక్స్ సీన్ ను ట్రయల్ షూట్ చేసుకురమ్మంటే పేలవంగా చేశారట. సీరియల్ నటులతో చేస్తే ఇలాగే ఉంటుంది అంటే.. నిజమైన నటీనటులతోనే ట్రయల్ షూట్ చేయమన్నారట. అది కూడా తేలిపోవడంతో సభాపతిని పంపించేశారు. కోడి రామకృష్ణ నిజానికి శ్యామ్ ఆస్థాన దర్శకుడు. తలంబ్రాలు, ఆహుతి, అంకుశం, అమ్మోరు, అంజి లాంటి సినిమాలు చేశారాయనతో. ఈసారి ఛేంజ్ కోసం చూద్దామనుకున్నారు కానీ.. చివరికి ఆయనతోనే సినిమా తీయాల్సి వచ్చింది. ఐతే అది మంచికే అయింది. ‘అరుంధతి’ని అద్భుతంగా తీసి పెట్టారు కోడి.