ప్యారిస్ లో మనోళ్ళ పరువు తీసింది

Update: 2016-11-29 13:59 GMT
మన దేశీ టూరిస్టులు ప్యారిస్ నగరం వెళితే ఎలా బిహేవ్ చేస్తారు? ఖచ్చితంగా అది కాస్త ఇబ్బంది పెట్టే విషయమే. ఎవరిని పడితే వారిని మన బాషలో అడ్రస్ అడగటం నుండి.. తిన్నవి సగం రోడ్డు మీదనే పడేయటం వంటి పనులు చేస్తుంటారు. సరిగ్గా ఇలాంటివన్నీ చెబుతూ ఇప్పుడు ప్యారిస్ లో టూరిస్ట్ గైడ్ గా పనిచేసే షైరా కొన్ని విషయాలను చెబుతోంది.

ఇంతకీ ఈ షైరా ఎవరనేగా మీ సందేహం. అబ్బే ఎవ్వరో కాదండోయ్. ''బేఫికర్'' సినిమాలో హీరోయిన్ వాణి కపూర్ పాత్ర పేరు షైరా గిల్. అమ్మడు ఒక టూరిస్ట్ గైడ్. అయితే ఆ పాత్రను జనాలకు పరిచయం చేయడానికి ఇప్పుడు యశ్ రాజ్ సంస్థ కొన్ని వీడియోలను రూపొందించింది. అందులో భాగంగా మన దేశీ టూరిస్టులు పారిస్ లో ఎలా బిహేవ్ చేస్తారో చూడండి అంటూ ఒకటి రూపొందించారు. వీడియో చూస్తే నవ్వు ఆగక చచ్చిపోవాలిగాని.. ఒక యాంగిల్ లో చూస్తే మనోళ్ళ పరువును మనమే తీసినట్లు ఉంటుంది.

ఏదేమైనా కూడా దేశీ టూరిస్టులు ఇక దేశీ వేషాలు వేయడం మానేసి.. కాస్త ప్రపంచాన్ని చూసి అప్డేట్ అయిపోవాలని చెబుతున్నాడా ఆదిత్య చోప్రా? డిసెంబర్ 9న బేఫికర్ సినిమా రిలీజవుతోంది కాబట్టి.. ఆయన ఏం చెప్పదలుచుకున్నాడో ఆ రోజు మనకు అర్ధమవుతుంది.
Full View


Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News