సిద్ శ్రీరామ్ .. ఇప్పుడు ఈ పేరు చెబితేనే యూత్ పూనకాలు వచ్చినట్టుగా ఊగిపోతోంది. ఒక స్టార్ హీరోకి ఎంత క్రేజ్ ఉంటుందో .. ఇప్పుడు ఆయనకి అంత క్రేజ్ ఉంటోంది. ఆయన పాడిన ప్రతి పాట హిట్ అవుతోంది. సినిమా అంతంత మాత్రంగా ఆడినా, ఆయన పాటలకి మాత్రం నూటికి నూరు మార్కులు పడిపోతున్నాయి. ఆయన పాటలు సినిమాలకి ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తున్నాయి. ఒక్కోసారి ఆయనే పాటలే ఆ సినిమాలకి ప్రధానమైన బలంగా మారుతున్నాయి. ఆయన పాటలకు వ్యూస్ 'ఉప్పెన'లా వచ్చిపడుతున్నాయి. అంతగా ఆయన తన స్వరంతో మనసు మనసుపై మంత్రం వేస్తున్నాడు .. మాయాజాలమే చేస్తున్నాడు.
తెలుగు .. తమిళ భాషల్లో ఆయన ఇప్పుడు బిజీ సింగర్. ఈ రెండు భాషల్లోను స్టార్ హీరోలంతా కూడా తమ సినిమాల్లో ఒక్క పాటైనా ఆయన పాడాలని కోరుకుంటున్నారు. ఇక దర్శక నిర్మాతలు కూడా ఆయన పాట ఒకటి తమ సినిమాలో ఉండవలసిందేనని పట్టుపడుతున్నారు. దాంతో ఆయన డిమాండ్ .. మార్కెట్ ఒక్కసారిగా పెరిగిపోయాయి. సిద్ శ్రీరామ్ స్వరంలోని ఒక రకమైన జీర .. ఆయన పలికించే ఫీల్ .. ఏదో తెలియని కొత్తదనాన్ని మనసు తెరలపై మధురంగా ఆవిష్కరిస్తున్నాయి. దాంతో ఆయన పాట పట్టుకుని యూత్ అంతా థియేటర్లకు వెళుతున్నారు.
ఇక సిద్ శ్రీరామ్ చూడటానికి బాగానే ఉంటాడు .. హీరోగా ట్రై చేసుకోవచ్చు అని అనుకున్నవారు కూడా ఎక్కువగానే ఉంటారు. ఇప్పుడు అలాంటివాళ్ల ముచ్చట తీరడానికి ఎక్కువకాలం పట్టకపోవచ్చనే టాక్ కోలీవుడ్ లో బలంగా వినిపిస్తోంది. మణిరత్నం దర్శకత్వంలో హీరోగా ఆయన ఒక సినిమా చేయనున్నాడనేది హాట్ టాపిక్ గా మారిపోయింది.
మణిరత్నం 'కడల్' సినిమాతోనే సిద్ శ్రీరామ్ కోలీవుడ్ కి సింగర్ గా పరిచయమయ్యాడు. అదే సినిమాతో తెలుగు ప్రేక్షకులకు కూడా చేరువయ్యాడు. అలాంటి మణిరత్నమే ఆయనను హీరోగా పరిచయం చేయనున్నాడని అంటున్నారు.
ఆల్రెడీ మణిరత్నం - సిద్ శ్రీరామ్ మధ్య కథా చర్చలు పూర్తయినట్టుగా చెబుతున్నారు. ప్రస్తుతం మణిరత్నం చేస్తున్న 'పొన్నియిన్ సెల్వన్' సినిమా పనులు పూర్తయిన తరువాత ఈ ప్రాజెక్టు ఉంటుందని అంటున్నారు. సింగర్స్ హీరోలుగా రాణించిన సందర్భాలు గతంలో కొన్ని ఉన్నాయి. తమిళంలో జీవీ ప్రకాశ్ కుమార్ .. హిప్ హాప్ తమిళ వంటి మ్యూజిక్ డైరెక్టర్స్ హీరోలుగా రాణిస్తున్న ఈ సమయంలో, ఈ పాపులర్ సింగర్ కూడా అదే బాటలో అడుగులు వేయడం విశేషమే. అయితే ఈ ప్రచారంపై సిద్ శ్రీరామ్ ఏం చెబుతాడనేది చూడాలి.