ఆంధ్రప్రదేశ్ లో టిక్కెట్టు ధరల వ్యవహారం రచ్చరచ్చగా మారుతోంది. ప్రస్తుతం ఈ అంశం కోర్టుల పరిధిలో విచారణలో ఉన్న సంగతి తెలిసిందే. టిక్కెట్టు ధరల అంశం సహా థియేటర్ల సమస్యల్ని ప్రభుత్వానికి విన్నవించేందుకు లేదా ఇందుకు కారణమైన ప్రభుత్వంపై ఎటాక్ చేసేందుకు కీలక నిర్ణయం నేడు ఎగ్జిబిటర్స్ సమావేశంలో తీసుకోనున్నారని చర్చ సాగుతోంది.
ఇంతకుముందే ఎగ్జిబిటర్స్ కి బాసటగా నిలుస్తూ నేచురల్ స్టార్ నాని చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి. అతడ ఏపీ ప్రభుత్వాన్ని తూర్పారబట్టారు. శ్యామ్ సింగరాయ్ విడుదలకు ముందు ఏపీలో టిక్కెట్టు ధరల వ్యవహారంపై నాని తీవ్ర అసంతృప్తిని వెల్లగక్కాడు. సినిమా హాళ్ల టికెట్ల ధరల కంటే పక్కనే ఉన్న కిరాణా దుకాణాల్లో రేట్లు బెటర్ గా ఉన్నాయంటూ నాని సంచలన వ్యాఖ్యలు చేశారు.
ఇప్పుడు అతడికి మరో హీరో సిద్ధార్థ్ కూడా బాసటగా నిలిచారు. ``కస్టమర్లు ప్రేక్షకులకు డిస్కౌంట్లు ఇచ్చేందుకే సినిమా టికెట్ ధరలు తగ్గిస్తున్నామని మంత్రులు అంటున్నారు. మేం పన్ను కడుతున్నాం..మీ లగ్జరీల కోసం పే చేస్తున్నాం. రాజకీయ నాయకులు అవినీతికి పాల్పడుతూ లక్షల కోట్లు సంపాదిస్తున్నారు. మీ లగ్జరీలు తగ్గించుకుని మాకు డిస్కౌంట్లు ఇవ్వండి!`` అంటూ ఘాటుగా స్పందించాడు సిద్ధార్థ్. ఏపీలో నాయకులపై పంచులు విసిరాడు. మొత్తానికి టికెట్ రేట్ల అంశంపై ఒక్కో హీరో ఓపెన్ అవుతున్నారు. ఇంతకుముందు పవర్ స్టార్ పవన్ కల్యాణ్ రిపబ్లిక్ వేదికపై జగన్ ప్రభుత్వంపైన.. మంత్రి పేర్ని నానిపైనా విరుచుకుపడిన సంగతి తెలిసిందే. అనంతర పరిణామాలు తెలిసిందే. పవన్ ని టార్గెట్ చేస్తూ వకీల్ సాబ్ కి జరిగినదేమోటి విధితమే. ఇప్పుడు నాని లాంటి హీరోల్ని ఒంటరిని చేసి కార్నర్ చేస్తారంటూ గుసగుసలు వేడెక్కిస్తున్నాయ్.