బాలీవుడ్ లో లవ్ లు బ్రేకప్ లు చాలా కామన్. ఎంతో మంది స్టార్స్ ప్రేమలో పడటం - ఆ తర్వాత కొన్నాళ్లకు విడిపోవడం.. మళ్లీ ప్రేమలో పడటం జరుగుతూనే ఉంది. ఆ కోవకు చెందిన వారే ఆలియా భట్ మరియు సిద్దార్థ్ మల్హోత్ర. వీరిద్దరు కలిసి మొదటగా స్టూడెంట్ ఆఫ్ ది ఇయర్ చిత్రంలో నటించారు. ఆ సినిమా సిద్దార్థ్ కు మొదటి సినిమా. ఇద్దరి మద్య సన్నిహిత్యం ఆ సినిమా సమయంలోనే పెరిగింది. స్నేహం కాస్త ప్రేమగా మారింది. ఇద్దరు డేటింగ్ అంటూ ఎంజాయ్ చేశారు. అయితే ఏదో కారణం వల్ల వీరిద్దరు విడిపోయారు. ప్రస్తుతం ఆలియా భట్ మరో స్టార్ తో ప్రేమలో పడి మునిగి తేలుతోంది.
వీరిద్దరు విడిపోయి చాలా కాలం అయ్యింది. ఈ సమయంలో బ్రేకప్ విషయం పై సిద్దార్థ్ నోరు విప్పాడు. ఇలాంటి రహస్యాలన్నీంటికి కూడా బయటకు తీసుకు వస్తున్న కాఫీ విత్ కరణ్ షో లోనే ఈ గుట్టు కూడా రట్టు అయ్యింది. తాజాగా సిద్దార్థ్ కరణ్ షోలో పాల్గొన్నాడు. ఆ సందర్బంగా తన ఎక్స్ లవ్ అఫైర్ గురించి - తన ఎక్స్ లవర్ గురించి సిద్దార్థ్ మాట్లాడటం జరిగింది. బ్రేకప్ కు కారణం ఏంటీ అనే విషయాన్ని క్లీయర్ గా కరణ్ కూడా రాబట్టలేక పోయాడు.
సిద్దార్థ్ చాలా తెలివిగా బ్రేకప్ గురించి మాట్లాడి తప్పించుకున్నాడు. మేమిద్దరం కూడా దూరం అవ్వడానికి ప్రొఫెషనల్ లైఫ్ కారణం అంటూ చెప్పుకొచ్చాడు. ఆలియా తన కెరీర్ ను నెక్ట్స్ స్టేజ్ కు తీసుకు వెళ్లాలనుకుంది. మేము విడిపోవడానికి ఇది ఒక కారణం. మేము విడిపోవాలని నిర్ణయించుకున్నాం. ఆ సమయంలో చాలా బాధ వేసింది. ఆమెతో ఎలాంటి గొడవ లేదు వివాదం లేదు. విడిపోయిన తర్వాత మళ్లీ ఎప్పుడు కలవలేదు. కాని ఇద్దరం స్నేహంగానే ఉన్నాం అంటూ సిద్దార్థ్ చెప్పుకొచ్చాడు. మా ఇద్దరిలో తప్పు ఎవరిది కాదన్నాడు. అంతా బాగానే ఉంటే కేవలం కెరీర్ కోసం బ్రేకప్ ఎలా అయ్యింది భయ్యా అంటూ కొందరు ప్రశ్నిస్తున్నారు. ఏదో బలమైన కారణం ఉండి ఉంటుంది కాని అది మాత్రం బయటకు చెప్పకుండానే సిద్దార్థ్ కవర్ చేశాడని అంతా అనుకుంటున్నారు.