వేలంటైన్స్ డే అంటే మనసుకు ఇష్టమైన వ్యక్తి కోసం, ఆ వ్యక్తితో కలిసి సంతోషంగా జరుపుకునే పండుగ రోజు. దీన్ని ప్రపంచం మొత్తం ఒప్పుకుంటోంది, ఫాలో అయిపోతోంది. అయితే.. హీరో సిద్ధార్ధ్ మాత్రం ప్రేమికుల రోజుకు కొత్త అర్ధం చెబుతున్నాడు. తన వేలంటైన్స్ డే అమ్మకే అంకితం అంటూ చెప్పిన సిద్ధూ.. తల్లితో తన అనుబంధాన్ని గురించి బోలెడన్ని మాటలు చెప్పాడు.
అయితే ప్రియురాలు - ప్రేమ అంటే మాత్రం సిద్ధూ చెప్పిన సంగతులు భలే విచిత్రంగా ఉన్నాయి. తనకు ఎలాంటి కండిషన్లు లేని ప్రేమంటేనే ఇష్టమని.. అలాంటి ప్రేమ పేరెంట్స్ తప్ప వేరే వాళ్లు ఇవ్వడం కష్టమని చెప్పాడు. అలాగే తన దగ్గర రెండు కుక్కలున్నాయని, అవి కూడా విశ్వాసంగా ఉంటాయంటున్నాడు సిద్ధూ. అసలు డబ్బుతో ప్రేమను కొనలేరని అందరూ అంటారు కానీ... డబ్బుతో లవ్వుని కొనచ్చని తను విన్నానంటున్నాడు. 'చిన్నప్పటి నుంచి తెలిసిన, చూసిన ప్రతీ విషయాన్ని రాసే అలవాటు ఉంటే.. కొన్నాళ్లకు రాయాల్సింది ఏమీ ఉండదు. అళాగే ప్రతీ విషయాన్ని ఫోటోల్లోనో, నేరుగానో చూస్తే... తర్వాత చూడాల్సింది ఏమీ ఉండదు. నా దృష్టిలో రొమాన్స్ కూడా అంతే' అన్నాడు సిద్ధు.
ప్రతీ 15 సెకన్లకోసారి వాట్సాప్ చూసుకుంటున్న జనాలు.. ఎప్పటికప్పుడు ఒకరితో ఒకరు టచ్ లో ఉంటున్నారని... అయితే ఒకరి చేతిలో చెయ్యి వేసి నడుస్తూ ఇంకొకళ్లకి వాట్సాప్ మెసేజ్ లు పంపే జనాలు తనకు తెలుసంటూ చెప్పాడు సిద్ధార్ధ్. ఇంతకీ సిద్ధూ చెప్పిన ఈ సంగతులన్నీ మాజీ లవర్ కి కౌంటర్లే అని సినీ జనాలు అనుకుంటున్నారు.