ఆ రీమేక్ కు హీరో సెట్ అయ్యాడట

Update: 2018-12-27 05:35 GMT
బాలీవుడ్ లో ఈమధ్య రిలీజ్ అయిన సినిమాల్లో ప్రేక్షకులతో పాటు విమర్శకులను కూడా మెప్పించిన చిత్రం 'అంధాధున్'.  శ్రీరామ్ రాఘవన్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాలో ఆయుష్మాన్ ఖురానా.. టబు కీలకపాత్రలలో నటించారు.  ఈ సినిమాలో ఆయుష్మాన్.. టబుల నటన ప్రేక్షకులను కట్టిపడేసింది. ఇప్పుడు ఈ డార్క్ కామెడీని తెలుగు- తమిళంలో రీమేక్ చేయడానికి రంగం సిద్దమయింది.

ఈ సినిమా తమిళ.. తెలుగు రీమేక్ రైట్స్ కోసం కొందరు నిర్మాతలు భారీ మొత్తం ఆఫర్ చేశారట. కానీ 'అంధాధున్' డైరెక్టర్ కం ప్రొడ్యూసర్ మాత్రం రీమేక్ రైట్స్ అమ్మేందుకు ఇంట్రెస్ట్ చూపించకుండా స్వయంగానే రిమేక్ చేయాలని డిసైడ్ అయ్యాడట. ఇప్పటికే ఈ రీమేక్ లో ఆయుష్మాన్ పాత్ర కోసం హీరో సిద్ధార్థ్ ను ఎంచుకున్నాడట. ఈ సినిమాను తెలుగు - తమిళ ద్విభాషా చిత్రంగా తెరకెక్కిస్తాడట.   తమిళంలో సిద్ధార్థ్ కు మార్కెట్ ఉంది గానీ తెలుగులో ప్రస్తుతం అతనికి మార్కెట్ లేదు.. సిద్ధార్థ్ లాస్ట్ సినిమా 'గృహం' మాత్రం తెలుగులో మంచి రెస్పాన్స్ తెచ్చుకుంది. తెలుగులో మళ్ళీ పుంజుకునేందుకు ఈ రీమేక్ సిద్ధార్థ్ కు మంచి అవకాశమే.

హీరో అంధుడిగా నటించే సినిమాలు తెలుగులో రేర్ గా వస్తుంటాయి.  రవి తేజ అంధుడి పాత్రలో 'రాజా ది గ్రేట్' తెరకెక్కినా అది మాస్ మసాలా సినిమానే గానీ నిజంగా హీరో అంధుడి పాత్రలో నటిస్తున్నాడనే ఫీలింగ్ కలగదు. కానీ ఈ 'అంధాధున్'  అలా ఉండదు. ఆడియన్స్ స్టొరీతో రిలేట్ అయ్యేలా ఉంటుంది. మరి ఈ రీమేక్ తో ప్రేక్షకులను ఎంతమాత్రం మెప్పిస్తారో వేచి చూడాలి.


Tags:    

Similar News