ముఖ‌మంతా బొక్క‌లే..నువ్వు హీరోనా?

Update: 2023-06-28 13:00 GMT
'డీజేటిల్లు' స‌క్సెస్ తో సిద్దు జొన్న‌ల‌గ‌డ్డ క్రేజీ స్టార్ గా మారిపోయిన సంగ‌తి తెలిసిందే. ఈ సినిమా స‌క్సెస్ సిద్దు స్థాయినే మార్చేసింది. అవ‌కాశాలు క్యూ క‌డుతున్నాయి. అత‌ని మ్యాన‌రిజ‌మ్ ని బేస్ చేసుకుని స్టోరీలు సిద్దం చేస్తున్నారు. ప్ర‌స్తుతం 'టిల్లుస్క్వేర్' అంటూ మ‌రో కొత్త చిత్రంలో న‌టిస్తున్నాడు. అలాగే ఓ మల‌యాళం సినిమా రీమేక్ లోనూ న‌టిస్తున్నాడు. ఇక సోష‌ల్ మీడియాలో సిద్దు నిత్యం వైర‌ల్ అవుతునూ ఉంటాడు. సెల‌బ్రిటీలు ఇంట‌ర్వ్యూలు..వైవిథ్య‌మైన డ్రెస్సింగ్ సెన్స్ తో ఆకట్టుకుంటున్నాడు.

ఇదంతా త‌న‌కి ఎలాంటి బ్యాక్ గ్రౌండ్ లేకుండా త‌న‌కు తాను సాధించుకున్న‌దే. అవును 'జోష్' సినిమాతో క్యారెక్ట‌ర్ ఆర్టిస్ట్ గా ప‌రిచ‌య‌మైన న‌టుడీయ‌న‌.  ఆ త‌ర్వాత 'ఆరెంజ్'..'భీమిలి క‌బ‌డ్డి జ‌ట్టు' ఇలా చాలా సినిమాలు చేసాడు.

అయితే  'గుంటూరు టాకీస్' సినిమాతో త‌న లో ఇంట‌ర్న‌ల్ ట్యాలెంట్ ని బ‌య‌ట పెట్టే అవ‌కాశం వ‌చ్చింది. ఆ సినిమాలో న‌టించ‌డంతో పాటు డైలాగ్ రైట‌ర్ గాను ప‌నిచేసాడు.  ఆ సినిమా బాగానే ఆడింది. దీంతో కుర్రాడిలో విష‌యం ఉంద‌ని ద‌ర్శ‌క‌-నిర్మాత‌లు ప్రోత్స‌హించారు.

ఆ త‌ర్వాత ప‌లు సినిమాల‌కు రైంటింగ్ విభాగంలోనూ ప‌నిచేసాడు. అయితే కెరీర్ ఆరంభంలో అవ‌మానాలు చాలానే ఎదుర్కున్నాడు. ఈ విష‌యాన్ని ఓ సంద‌ర్భంలో రివీల్ చేసాడు. ఆవేంటో ఆయ‌న మాట‌ల్లోనే..'అయిదారేళ్ల కింద‌ట ఒకత‌ను అన్న మాట‌లు ఎప్ప‌టికీ మ‌ర్చిపోలేను.

నా ముఖం మీద మొటిమ‌లు వాటి తాలుకా మ‌చ్చ‌లుంటాయి. గుంత‌లు కూడా ఉంటాయి. సినిమాల్లో ప్ర‌య‌త్నాలు చేసేట‌ప్పుడు ఈ ముఖంతో హీరో అవుదామ‌ని ఎలా అనుకున్నావ్? అని నా ముఖం మీద‌నే ఒక‌రు అన్నారు.

ఆ మాట త‌ట్టుకోలేక ఏడ్చేసాను. కానీ జీవితంలో ఏది ప‌రిపూర్ణం కాదు. ప‌ట్టుద‌ల‌తో ప్ర‌య‌త్నిస్తే సాధించ‌లేనిది అంటూ ఏదీ ఉండ‌దు అని నాకు నేనే ధైర్యం తెచ్చుకుని ఇంకా క‌సిగా ప్ర‌య‌త్నాలు చేసేవాడిని' అని అన్నారు. 

Similar News