ఒక స్టార్ ప్రొడ్యూసర్ కి వారసుడు.. స్టార్ హీరోకి సోదరుడు.. స్టూడియోల యజమాని.. దశాబ్ధాల పాటు సినీరంగంలో వేళ్లూనుకున్న మూవీ మొఘల్స్ వంశస్తుడు.. అయినా కానీ.. అతడి లాంచింగ్ ఎంతో సింపుల్ గా జరిగింది. అసలు తెరంగేట్రం చేస్తున్నాడా లేదా? అన్న డౌట్ పుట్టేలా ఏమాత్రం హంగామా లేకుండా డెబ్యూ మూవీని పూజా కార్యక్రమాలతో ప్రారంభించేశారు. ఇంతకీ ఎవరా హీరో..? అంటే.. ఇంకెవరు.. దగ్గుబాటి అభిరామ్.
మూవీ మొఘల్ రామానాయుడు మనవడు.. డి.సురేష్ బాబు వారసుడు .. దగ్గుబాటి రానా తమ్ముడు అభిరామ్ సినీఆరంగేట్రంపై చాలా కాలంగా రకరకాల ప్రచారం ఉంది. తేజ దర్శకత్వంలో అతడు నటిస్తాడని.. గత కొంతకాలంగా స్క్రిప్టు వర్క్ సాగుతోందని కూడా ప్రచారమైంది. ఎట్టకేలకు పూజాకార్యక్రమాలతో దగ్గుబాటి అభిరామ్ మొదటి సినిమా లాంఛనంగా ప్రారంభమైంది. అసలు ఎలాంటి మీడియా హంగు ఆర్భాటం లేకుండానే ఈ లాంచింగ్ కార్యక్రమం ముగిసింది.
దీంతో పాటే మరో ఆసక్తికర విషయం తెలిసింది. అభిరామ్ దగ్గుబాటిని డి. సురేశ్ బాబు స్వయంగా లాంచ్ చేయడం లేదు. తనకి నమ్మకస్తుడైన జెమిని కిరణ్ కి అప్పగించారు. ఆనంది ఆర్ట్స్ క్రియేషన్స్ పై జెమిని కిరణ్ ఈ సినిమాను నిర్మిస్తున్నారు. తేజ దర్శకత్వం వహిస్తుండగా.. ఆర్పీ పట్నాయక్ మ్యూజిక్ అందిస్తున్నారు. యాక్షన్ థిల్లర్ కథాంశం తో ఈ సినిమా తెరకెక్కనుంది. అహింస అనే టైటిల్ ని ఫైనల్ చేశారు.
అయితే ఇద్దరు స్టార్ హీరోలతో పెద్ద బ్యాక్ గ్రౌండ్ ఉన్న సినీఫ్యామిలీ నుంచి హీరో లాంచింగ్ అంటే అభిమానులు చాలా ఎక్కువ ఊహిస్తారు. హీరో లాంచింగ్ భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ మధ్య జరగాలని కోరతారు.. కానీ అభిరామ్ వాటన్నిటికీ భిన్నంగా చాలా సింపుల్ గా తన సినిమాని మొదలెట్టేశాడు. అయితే ఈ ప్రయోగం గురించి మీడియాకి కూడా సరైన సమాచారం లేదు. ఠెంకాయ కార్యక్రమంతో మొదలు పెట్టారు. త్వరలోనే ఈ మూవీ రెగ్యులర్ షూటింగ్ ప్రారంభమవుతుంది. సూత్రప్రాయంగా తారాగణం ఇతర సిబ్బందికి సంబంధించిన వివరాలు తర్వాత తెలుస్తాయి. కథానాయికగా ఉప్పెన ఫేం కృతి శెట్టిని సంప్రదించినా కాల్షీట్ల సమస్య తలెత్తిందని దీంతో వేరొక హీరోయిన్ ని వెతికే పనిలో ఉన్నారని తెలిసింది. ఆసక్తికరంగా అభిరామ్ ని తేజ రెగ్యులర్ ప్రేమకథతో కాకుండా ఒక యాక్షన్ కథాంశంతో లాంచ్ చేస్తుండడంపై సర్వత్రా ఆసక్తికర చర్చ సాగుతోంది.