'ప్రాజెక్ట్ కె' సెట్ లో లెజండ‌రీ డైరెక్ట‌ర్‌

Update: 2022-12-09 10:30 GMT
పాన్ ఇండియా స్టార్ ప్ర‌భాస్ ప్ర‌స్తుతం వ‌రుస క్రేజీ ప్రాజెక్ట్ ల‌లో న‌టిస్తూ బిజీ బిజీగా గ‌డిపేస్తున్నారు. వంద కోట్ల బ‌డ్జెట్ ల‌తో ప్ర‌భాస్ హీరోలు సినిమాలు రూపొందుతున్న విష‌యం తెలిసిందే. మునుపెన్న‌డూ లేనంత‌గా బ్యాక్ టు బ్యాక్ సినిమాల‌తో బిజీ బిజీగా గ‌డిపేస్తున్నారు. బాలీవుడ్ డైరెక్ట‌ర్ ఓమ్ రౌత్ తో 'ఆది పురుష్‌' చేసిన ప్ర‌భాస్ ఈ మూవీ రిలీజ్ కోసం అభిమానుల‌తో పాటు త‌ను కూడా ఆస‌క్తిగా ఎదురు చూస్తున్నాడు. టీజ‌ర్ గ్రాఫిక్స్‌ పై ఓ రేంజ్ లో ట్రోల్ వైర‌ల్ కాడంతో చిత్ర బృందం వీటిని క‌రెక్ష‌న్ చేసే ప‌నిలో ప‌డింది.

ఇక ఈ మూవీ త‌రువాత ప్ర‌భాస్ 'కేజీఎఫ్‌' డైరెక్ట‌ర్ ప్ర‌శాంత్ నీల్ డైరెక్ష‌న్ లో హై వోల్టేజ్ యాక్ష‌న్ డ్రామాగా తెర‌కెక్కుతున్న 'స‌లార్‌'లో న‌టిస్తున్నాడు. ప్ర‌స్తుతం ఈ మూవీ షూటింగ్ జ‌రుగుతోంది. ఈ సినిమాతో పాటు మ‌రో రెండు క్రేజీ ప్రాజెక్ట్ ల‌ని కూడా ప్ర‌భాస్ ప‌ట్టాలెక్కించిన విష‌యం తెలిసిందే.

'మ‌హాన‌టి' ఫేమ్ నాగ్ అశ్విన్ తో టైమ్ ట్రావెల్ సైన్స్ ఫిక్ష‌న్ 'ప్రాజెక్ట్ కె'లో న‌టిస్తున్నాడు. ఈ మూవీ కూడా షూటింగ్ ద‌శ‌లో వుంది. దీనితో పాటు మారుతి డైరెక్ష‌న్ లో ప్ర‌భాస్ హార‌ర్ థ్రిల్ల‌ర్ చేస్తున్న విష‌యం తెలిసిందే.

పీపుల్ మీడియా ఫ్యాక్ట‌రీ బ్యాన‌ర్ పై ఈ మూవీని అత్యంత భారీ స్థాయిలో నిర్మిస్తున్నారు. ఈ మూవీ కూడా ప్ర‌స్తుతం చిత్రీక‌ర‌ణ ద‌శ‌లో వుంది. ఇదిలా వుంటే నాగ్ అశ్విన్ డైరెక్ట్ చేస్తున్న 'ప్రాజెక్ట్ కె' మూవీ షూటింగ్ ప్ర‌స్తుతం హైద‌రాబాద్ లో జ‌రుగుతోంది.

ఈ మూవీకి మెంట‌ర్ గా సీనియ‌ర్ ద‌ర్శ‌కుడు సింగీతం శ్రీ‌నివాస‌రావు వ్య‌వ‌హ‌రిస్తున్నారు. స్క్రిప్ట్ ద‌శ‌లోనే తాను కావాల్సిన సూచ‌న‌లు, స‌ల‌హాలు ఇచ్చాన‌ని, ప్ర‌స్తుతం తాను సినిమా షూటింగ్ సెట్ కు వెళ్ల‌డం లేద‌ని ఆ మ‌ధ్య సింగీతం శ్రీ‌నివాస‌రావు వెల్ల‌డించడం తెలిసిందే.

అయితే తాజాగా ఈ మూవీ సెట్ లో సీనియ‌ర్ లెజెండ‌రీ డైరెక్ట‌ర్ సింగీతం శ్రీ‌నివాస రావు ప్ర‌త్య‌క్ష‌మ‌య్యారు. ప్ర‌భాస్ తో క‌లిసి లెజెండ‌రీ డైరెక్ట‌ర్ సింగీతం శ్రీ‌నివాస రావు వున్న ఓ ఫొటో ప్ర‌స్తుతం నెట్టింట వైర‌ల్ గా మారింది. ఈ ఫొటోని నెట్టింట వైర‌ల్ చేస్తున్న ఫ్యాన్స్ హ‌ల్ చ‌ల్ చేస్తున్నారు. గ‌తంలో 'ప్రాజెక్ట్ కె' విష‌యంలో త‌న ప‌ని అయిపోయింద‌ని, ఇక సెట్ లోకి వెళ్ల‌న‌ని ప్ర‌క‌టించిన లెజెండ‌రీ డైరెక్ట‌ర్ సింగీతం శ్రీ‌నివాస రావు తాజాగా ప్ర‌భాస్ తో క‌లిసి 'ప్రాజెక్ట్ కె' సెట్ లో సంద‌డి చేస్తుండ‌టం అభిమానుల‌ని ఆక‌ట్టుకుంటోంది.




నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.
Tags:    

Similar News