ప్రముఖ సెలబ్రిటీ జంట చిన్మయి శ్రీపాద - రాహుల్ రవీంద్రన్ కవలలకు వెల్ కం చెప్పారు. జూన్ 21 మంగళవారం నాడు తమ అభిమానులకు శుభవార్తను తెలిపారు. మొదటి సంతానంగా కవలలను స్వాగతించిన ఈ జంట ప్రెగ్నెన్సీ సహా ప్రతిదీ గోప్యంగానే ఉంచడంతో ఇరువురి ఫాలోవర్స్ కి ఈ వార్త ఆశ్చర్యాన్ని కలిగించింది.
ఈ జంటకు కుమార్తె ..కొడుకు జన్మించగా.. ద్రిప్తా - శర్వాస్ అని పేర్లను కూడా ఇన్ స్టాగ్రామ్ లో పరిచయం చేశారు. చిన్మయి శ్రీపాద-రాహుల్ రవీంద్రన్ తమ కవలల ఫోటోలను షేర్ చేసారు.
``ద్రిప్తా మరియు శర్వాస్... మన విశ్వానికి కొత్త.. ఎప్పటికీ ప్రేమ కేంద్రం`` అంటూ లవ్ ఈమోజీలను షేర్ చేసారు. చిన్మయి ప్రెగ్నన్సీ గురించి ఇటీవల చాలా ఊహాగానాలు సాగినా కానీ ఈ జంట దాని గురించి పెదవి విప్పలేదు.
తరువాత చిన్మయి శ్రీపాద తన ఇన్ స్టాగ్రామ్ పేజీలో సరోగసీ పుకార్లను ప్రస్తావిస్తూ సుదీర్ఘమైన నోట్ ను పోస్ట్ చేసారు. సరోగసీ ద్వారా తనకు కవలలు పుట్టారా? అని చాలా మంది మెసేజ్ చేశారని వెల్లడించారు. తన ప్రెగ్నెన్సీ గురించి సన్నిహితులకే తెలుసంటూ చిన్మయి రూమర్లకు తెరదించారు.
``నేను గర్భవతిగా ఉన్న ఫోటోలను పోస్ట్ చేయనందున .. సర్రోగేట్ (అద్దె గర్భం) ద్వారా కవలలు పుట్టారా? అని అడిగే వారిని నేను కచ్చితంగా ప్రేమిస్తున్నాను. నన్ను నేను రక్షించుకుంటున్నందున నా అంతరంగిక వ్యక్తులకు మాత్రమే ఈ విషయం తెలుసు`` అని చిన్మయి పోస్ట్ చేసారు.
ఆసక్తికరంగా గాయని తన సి-సెక్షన్ సమయంలో ఆమె భజన పాటలు పాడినట్లు వెల్లడించారు. తన వ్యక్తిగత జీవితం విషయంలో కుటుంబం .. స్నేహితులు ఎల్లప్పుడూ చాలా జాగ్రత్తగా ఉంటారని ధృవీకరించారు. తన కవలలు ద్రిప్తా- శర్వాస్ ఫోటోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేసే ఆలోచన తనకు లేదని చిన్మయి అన్నారు. కవలలు ఒక అమ్మాయి .. ఒక అబ్బాయి అని తెలిపారు.