సౌత్ ఇండియా లో మీటూ అనగానే సింగర్ చిన్మయి గుర్తుకు వచ్చేంతగా ఆమె ఫేమస్ అయ్యింది. చిన్మయి ప్రముఖ రచయిత వైరముత్తు పై లైంగిక వేదింపుల ఆరోపణలు చేయడం తో మొదలైన వివాదం మొన్నటి డబ్బింగ్ ఆర్టిస్టు అసోషియేషన్ ఎన్నికల్లో నామినేషన్ ను తిరష్కరించే వరకు కొనసాగుతూనే ఉంది. ఈ క్రమంలో వైరముత్తు సైడ్ అయ్యి పోగా డబ్బింగ్ ఆర్టిస్టు అసోషియేషన్ అధ్యక్షుడు అయిన రాధరవి పై చిన్మయి యుద్దం మొదలు పెట్టింది.
తనను చిన్న కారణం చెప్పి డబ్బింగ్ ఆర్టిస్టు అసోషియేషన్ నుండి రాధరవి తొలగించడంతో ఆమె అగ్గిమీద గుగ్గిలం అయ్యి కోర్టుకు వెళ్లింది. కోర్టులో ఆమెకు పాజిటివ్ స్పందన వచ్చింది. తుది విచారణ పూర్తి అయ్యే వరకు ఆమెకు అసోషియేషన్ లో సభ్యత్వంను కొనసాగించాల్సిందే అంటూ కోర్టు తీర్పు ఇచ్చింది. ఇటీవల అసోషియేషన్ ఎన్నికలు జరుగగా అధ్యక్షరాలిగా పోటీ చేసేందుకు చిన్మయి సిద్దం అయ్యింది. కాని చిన్మయికి సభ్యత్వం లేని కారణంగా పోటీ చేసేందుకు అర్హురాలు కాదని ఎన్నికల అధికారి తేల్చి చెప్పాడు.
ఎన్నికల అధికారి నామినేషన్ ను తిరష్కరించడంతో రాధరవి మళ్లీ ఏకగ్రీవంగా అసోషియేషన్ అధ్యక్షుడిగా నియమితుడు అయ్యాడు. అసోషియేషన్ ఎన్నికలు చట్ట ప్రకారం జరగలేదని తన నామినేషన్ ను అన్యాయంగా తిరష్కరించాంటూ చిన్మయి ఆగ్రహం వ్యక్తం చేస్తూ రాధారవి ఎన్నిక చెల్లదు అంటూ కోర్టును ఆశ్రయించింది.
ఇటీవలే అసోషియేషన్ అధ్యక్ష బాధ్యతలను మళ్లీ స్వీకరించిన రాధరవి మాట్లాడుతూ చిన్మయిపై తీవ్ర స్థాయిలో విరుచుకు పడ్డాడు. పబ్లిసిటీ కోసం ఆమె ఎంతకైనా దిగజారేలా ప్రవర్తిస్తుంది. ఆమె ఇదంతా కూడా పబ్లిసిటీ కోసమే చేస్తోంది. ఆమె నాపై పదే పదే విమర్శు చేస్తూ ఉంటే ఊరుకునేది లేదని.. ఆమెపై కేసు పెట్టేందుకు కూడా వెనుకాడను అంటూ హెచ్చరించాడు. మొత్తానికి వీరిద్దరిమద్య గొడవ మాత్రం అస్సలు చల్లారే పరిస్థితి కనిపించడం లేదు.