8 ఏళ్ల బాలికపై లైంగిక దాడి..చిన్మయి సాయం కోరిన తల్లి!

Update: 2020-06-09 00:30 GMT
ఈ మద్య కాలంలో చిన్మయి సోషల్‌ మీడియాలో చాలా యాక్టివ్‌ గా ఉంటుంది. ఎక్కడ ఏ చిన్న సంఘటన జరిగినా మహిళలు లైంగిక వేదింపులకు గురి అయినా కూడా వెంటనే తన ట్విట్టర్‌ అకౌంట్‌ లో స్పందిస్తూనే ఉంటుంది. మహిళలపై జరుగుతున్న లైంగిక దాడులపై ఆమె ఆవేదన వ్యక్తం చేస్తూ చేసే ట్వీట్స్‌ ఎప్పటికి అప్పుడు వైరల్‌ అవుతూనే ఉన్నాయి. తాజాగా ఒక మహిళ తన బిడ్డ విషయంలో పడిన వేదన గురించి చిన్మయి ట్విట్టర్‌ లో షేర్‌ చేసుకుంది.

ఆ మహిళ చిన్మయికి పంపిన సందేశంలో.. నా కూతురుకు 8 సంవత్సరాలు. 2వ తరగతి చదువుతోంది. ఇటీవల తను బయట నుండి ఇంట్లోకి వచ్చి తన ప్రైవేట్‌ పార్ట్‌ వద్ద నొప్పిగా మంటగా ఉందని చెప్పి ఏడిచింది. అక్కడ తనకు గాయం ఎలా అయ్యిందో నాకు అర్థం కాలేదు. ఆ తర్వాత మా పక్క ఇంట్లోనే ఉండే 7వ తరగతి కుర్రాడు పాపను పక్కకు పిలవడం పాప భయపడుతూ ఉండటం గమనించాను. ఆ సమయంలో కూడా బలవంతంగా పాపను ఆ కుర్రాడు తీసుకు వెళ్లేందుకు ప్రయత్నించాడు. నేను చూడటంతో అతడు వదిలి పెట్టాడు.

ఆ సమయంలో తన కుటుంబ సభ్యులతో ఈ విషయాన్ని చెప్పవద్దంటూ ఆ కుర్రాడు నన్ను ప్రాధేయ పడ్డాడు. నా కూతురు మాత్రం అతడి గురించి చాలా భయపడుతోంది. కనీసం బయటకు వెళ్లేందుకు కూడా తను ఆందోళన చెందుతోంది. మళ్లీ అతడు దాడి చేస్తాడేమో అనే భయంతో బిక్కు బిక్కు మంటుంది. ఆమె భయంను పోగొట్టేందుకు ఏం చేసినా ఫలితం లేకుండా పోయింది. ఈ విషయంలో నాకు ఏమైనా సలహా ఇవ్వగలరా అంటూ ఆ తల్లి చిన్మయిని కోరింది. ఆమె మెసేజ్‌ ను ట్వీట్‌ చేసిన చిన్మయి ప్రతి రోజు ఇలాగే జరుగుతుంది అంటూ ఆవేదన వ్యక్తం చేస్తూ కామెంట్‌ పెట్టింది.
Tags:    

Similar News