ప్రముఖ గాయని సునీత అంటే తెలియని వారుండరు. సింగర్‌గా, యాంకర్‌గా, డబ్బింగ్ ఆర్టిస్ట్‌గా తనదైన ముద్ర వేసి సునీత.. చక్కనైనా రూపంతోనూ భారీ ఫాలోయింగ్‌ను సంపాదించుకుంది. అయితే మొదటి భర్త కిరణ్‌తో విడిపోయిన దగ్గర నుంచీ పిల్లలను చూసుకుంటూ ఒంటరి జీవితాన్నే గడుపుతున్న సునీత.. గత ఏడాది మ్యాంగో మీడియా గ్రూప్ అధినేత రామ్ వీరపనేనిని రెండో వివాహం చేసుకుంది.
అప్పట్లో వీరి పెళ్లిని చాలా మంది ప్రోత్సహిస్తే.. విమర్శించిన వారు ఎందరో ఉన్నారు. కానీ, సునీత మాత్రం వాటినేమి పట్టించుకోకుండా ఇటు ప్రొఫెషనల్ లైఫ్‌ను, అటు పర్సనల్ లైఫ్‌ను సక్సెస్ ఫుల్‌గా రన్ చేస్తోంది. పైగా వివాహం తర్వాత సోషల్ మీడియాలో మరింత యాక్టివ్ అయిన సునీత.. ఎప్పటికప్పుడు భర్త రామ్‌తో దిగిన ఫొటోలను షేర్ చేస్తుంటుంది.
తాజాగా రంగారెడ్డి జిల్లా ముచ్చింతల్‌లోని శ్రీరామనగరంలోని సమతా విగ్రహం వద్దకు సునీత తన భర్తతో కలిసి వెళ్లారు. ఈ సందర్భంగా అక్కడ దిగిన ఓ ఫొటోను సునీత తన సోషల్ మీడియా ఖాతాలో పోస్ట్ చేస్తూ `సాట్యూ ఆఫ్ ఈక్వాలిటీ` అని రాసుకొచ్చింది. దీంతో ఈ ఫొటో క్షణాల్లో వైరల్ అయింది. చాలా మంది ఈ పిక్‌పై లైకుల వర్షం కురిపించారు.
కానీ, ఓ నెటిజన్ మాత్రం `కాకి ముక్కుకి దొండ పండు. సునీతకు ముసలి రామ్ మొగుడు. అందం ఆమె సొంతం, ధనము ఆయన సొంతం` అంటూ రెచ్చిపోయాడు. ఇక అంత మాటంటే ఊరుకుంటుందా.. వెంటనే సునీత అతడికి బుద్ధి చెప్పింది. `నోటి దూల నీది. నీ భారం భూమిది` అంటూ తనదైన శైలిలో కౌంటర్ ఇచ్చి సదరు నెటిజన్‌కి దిమ్మతిరిగేలా చేసింది.