మ్యూజిక్ డైరెక్టర్ భార్య మాటలతో ఏడ్చేశాను ః సునీత

Update: 2021-08-10 00:30 GMT
సింగర్ సునీత ఈమద్య వివాహం చేసుకున్నారు. అంతకు ముందు ఆమె వ్యక్తిగత విషయాలను ఎక్కువగా సోషల్‌ మీడియాలో షేర్‌ చేసుకునే వారు కాదు. కాని ఇప్పుడు ఆమె పలు సందర్బాల్లో.. పలు వేదికలపై తన కెరీర్ లో ఎదుర్కొన్న అవమానాలు.. తన కెరీర్‌ సాగిన తీరు గురించి చెప్పుకొచ్చింది. ఇటీవల ఒక సందర్బంగా సునీత మాట్లాడుతూ ప్రముఖ సంగీత దర్శకుడి స్టూడియోలో పాటను పాడేందుకు వెళ్లిన సమయంలో జరిగిన సంఘటన గురించి చెప్పింది. ఆ సమయంలో చాలా బాధ వేసిందని.. తనకు ఎందుకు ఇలా అనే ఆవేదన కూడా కలిగేదని చెప్పుకొచ్చింది.

పాటను పాడేందుకు వెళ్లిన సమయంలో మ్యూజిక్ డైరెక్టర్‌ నాకు చేతికి మైక్ ఇచ్చాడు. పాట పాడటం పూర్తి అయిన తర్వాత మళ్లీ ఆ మైక్‌ ను అక్కడ పెట్టేసి వచ్చాను. పాట పాడి వెళ్లి పోతున్న సమయంలో అక్కడే ఉన్న ఆ మ్యూజిక్ డైరెక్టర్‌ బార్య పిలిచారు. ఆమె వద్దకు వెళ్లగా ఆమె మైక్ తీసుకున్న సమయంలో నీవు ఆయన చేతిని నీ వేళ్లతో టచ్ చేశావు. ఏమనుకుంటున్నావు అసలు నీ గురించి అంటూ సీరియస్ అయ్యింది. ఆ సమయంలో నేను చాలా సీరియస్ గానే ఆమెకు రియాక్ట్‌ అయ్యాను. ఆమె పై నా శైలిలో కౌంటర్ ఇచ్చాను. కాని నేను ఆ సమయంలో చాలా బాధ పడ్డాను.

ఆ రోజు రాత్రి అంతా కూడా ఏడ్చేశాను. ఆమె వ్యాఖ్యలకు అదే స్థాయిలో సమాధానం ఇచ్చినా కూడా నేను మాత్రం చాలా బాధ పడ్డాను. రికార్డింగ్‌ స్టూడియోకు వెళ్లిన సమయంలో చాలా సార్లు చాలా రకాల అవమానాలు ఎదుర్కొన్నాను అంటూ ఆవేదన వ్యక్తం చేసింది. సోషల్‌ మీడియాలో కూడా గతంలో సునీత గురించి కుప్పలు తెప్పలుగా పుకార్లు పుట్టించారు. అయినా కూడా ఆమె మాత్రం ధైర్యంగానే జీవితంలో నిలిచారు. రెండవ పెళ్లి సమయంలో కూడా ఆమెను చాలా మంది చాలా రకాలుగా కామెంట్స్ చేశారు. తాను అనుకున్నది చేసుకుంటూ సునీత ఎంతో మందికి ఆదర్శంగా నిలిచారు.
Tags:    

Similar News