డ్రగ్స్ విచారణ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న ప్రముఖ నటుడు నవదీప్ సోమవారం ఉదయం సిట్ కార్యాలయానికి చేరుకున్నారు. సుమారు 11 గంటల పాటు విచారణ ఎదుర్కొన్న నవదీప్ కు సంబంధించి ఆసక్తికర అంశాలు కొన్ని చోటు చేసుకున్నాయి. సిట్ కార్యాలయానికి వచ్చిన సందర్భంగా నవదీప్ హుషారుగా కనిపించారు. కార్యాలయంలోని మెట్లను ఎక్కే సందర్భంలో హుషారుగా ఎక్కి.. అక్కడున్న వారికి నమస్కారం పెట్టి.. విచారణను ఎదుర్కొనేందుకు తానెంతో కాన్ఫిడెంట్ గా ఉన్నట్లుగా తన వైఖరితో చెప్పారు.
ఇదిలా ఉంటే.. విచారణ ముగిసిన తర్వాత మాత్రం ఆయన ముభావంగా ఉండటం స్పష్టంగా కనిపించింది. విచారణ తర్వాత బయటకు వచ్చిన నవదీప్ మీడియాతో మాట్లాడుతూ పొడిపొడిగా నాలుగు ముక్కలు చెప్పేసి వెళ్లిపోయారు. అధికారులు అడిగిన ప్రశ్నలకు సమాధానాలు చెప్పానని.. ఇంకేమైనా సందేహాలు ఉంటే ఫోన్ చేస్తామని అధికారులు చెప్పినట్లుగా పేర్కొన్నారు.
విచారణకు వచ్చినప్పుడు.. విచారణ ముగిసిన తర్వాత తిరిగి వెళ్లే సమయంలో నవదీప్ బాడీ లాంగ్వేజ్ లో తేడా కొట్టొచ్చినట్లుగా కనిపించిందన్న అభిప్రాయం పలువురి నోట వినిపిస్తోంది. ఇదిలా ఉంటే.. విచారణ సందర్భంగా గోళ్లు.. రక్తపు నమూనాలను తీసుకునేందుకు నవదీప్ ను అధికారులు కోరగా.. వాటిని ఇచ్చేందుకు ఆయన నో చెప్పినట్లుగా తెలుస్తోంది. రక్తపు నమూనాలు ఇచ్చేందుకు తనకు ఇష్టం లేదని స్పష్టం చేయటంతో అధికారులు ఆ విషయంలో నవదీప్ ను మరింత బలవంతం పెట్టలేదని చెబుతున్నారు. రక్తపు నమూనాలు ఇవ్వాలని కోర్టు ఆదేశాలు ఉంటే తాను ఇస్తానని చెప్పినట్లుగా సమాచారం. నవదీప్ చెప్పిన మాటల్ని కేస్ షీట్లో రాయనున్నట్లు తెలుస్తోంది.