సీతగారు.. సెట్టయినట్లే!

Update: 2022-09-03 10:30 GMT
ప్రతి ఏడాది కూడా సినిమా పరిశ్రమలో వందలాది సినిమాలు వస్తున్నాయి. ఇక అందులో దాదాపు సగం సినిమాలతో కొత్త హీరోయిన్లు పరిచయమవుతున్నారు. ఇక ఇప్పుడు భాషతో సంబంధం లేకుండా కూడా అవకాశాలు అందుకునే ఛాన్స్ అయితే వస్తోంది. మరోవైపు వెబ్ సిరీస్ లు కూడా డామినేట్ చేస్తున్నాయి కాబట్టి మంచి టాలెంట్ ఉన్న నటి నటులకు ఇది సరైన అవకాశం అని చెప్పవచ్చు. ఏ మాత్రం క్లిక్ అయినా కూడా దాదాపు రెండు మూడేళ్ల వరకు బ్యాక్ టు బ్యాక్ ఆఫర్స్ వచ్చే అవకాశం అయితే ఉంటుంది.

ఇక తెలుగు పరిశ్రమలో ప్రస్తుతం ఓ వర్గం హీరోలకు హీరోయిన్స్ కొరత ఏర్పడడంతో కరెక్టుగా సీతారామం సినిమాతో మృనల్ ఠాగూర్ బెస్ట్ ఆప్షన్ గా మారే అవకాశం అయితే ఉంది. హను రాఘవపూడి దర్శకత్వంలో వచ్చిన సీతారామం సినిమాలో మృనల్ నటన అందరిని ఎంతగానో ఆకట్టుకుంది. పెద్దగా గ్లామర్ డోస్ పెంచకుండానే తన భావభావాలతో కుర్రాళ్ళను ఎంతగానో ఎట్రాక్ట్ చేసింది. ఇంతకుముందు మృనల్ కు పెద్దగా బాక్స్ ఆఫీస్ వద్ద సక్సెస్ అందుకోలేదు.

ఎక్కువగా టెలివిజన్ సీరియల్స్ ద్వారా అలాగే కొన్ని మిడ్ రేంజ్ సినిమాలతో గుర్తింపు అందుకుంది. ఇటీవల వచ్చిన బాలీవుడ్ జెర్సీ రీమేక్ సినిమాలో కూడా హీరోయిన్ గా కనిపించింది. కానీ ఆ సినిమా డిజాస్టర్ కావడంతో హిందీ కెరీర్ పై అయితే ప్రభావం పడుతుంది. ఇక రీసెంట్ గా తెలుగులో సీతారామం సినిమాతో సక్సెస్ అందుకోవడం బాగా కలిసి వచ్చింది. ఇప్పుడు రామ్ చరణ్ జూనియర్ ఎన్టీఆర్ అలాగే ప్రభాస్ ఇలా చాలామంది అగ్ర హీరోలు కొత్త తరం హీరోయిన్ల కోసం ఎదురుచూస్తున్నారు.

దర్శకులకు కూడా హీరోయిన్స్ సెలెక్ట్ చేయడం పెద్ద టాస్క్ మారిపోయింది. ఇక ఇప్పటికే రష్మిక మందన పూజా హెగ్డే లాంటి వాళ్ళు జనాలకు బోర్ కొట్టేశారు అనే ఫీలింగ్ కూడా వచ్చేస్తుంది. ఇక తమన్నా సమంత లతో మరోసారి నటించడానికి పెద్ద హీరోలు ఆసక్తి చూపడం లేదు.

ఇక ఈ సమయంలో సీత పాత్రతో మెప్పించిన మృనల్ ఠాగూర్ జనాలను మెప్పించడం బాగా కలిసి వచ్చే అంశం. కాబట్టి ఇదే సరైన అవకాశంగా కంటెంట్ ఉన్న కథలను సెలెక్ట్ చేసుకుని టాలీవుడ్లో కొన్నాళ్లపాటు స్థిరపడే ఛాన్స్ ఉంటుంది. మరి ఈ అవకాశాన్ని మృనల్ ఎంతవరకు ఉపయోగించుకుంటుందో చూడాలి.



నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.
Tags:    

Similar News