స్టార్ డైరెక్టర్ల శిష్యులు చాలా వరకు ఇండస్ట్రీలో దర్శకులుగా తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. కొంత మంది సక్సెస్ లు సాధిస్తున్నారు. మరి కొంత మంది బ్లాక్ బస్టర్ హిట్ లని సొంతం చేసుకుని నెక్స్ట్ లెవెల్ కి వెళుతున్నారు. ఈ వరుసలో స్టార్ డైరెక్టర్ సుకుమార్ శిష్యులు ఇప్పుడు ముందు వరుసలో నిలుస్తున్నారు. గత ఏడాది 'ఉప్పెన' సినిమాతో బుచ్చిబాబు సానా బ్లాక్ బస్టర్ హిట్ ని సొంతం చేసుకుని వార్తల్లో నిలిచిన విషయం తెలిసిందే.
ఈ మూవీతో వంద కోట్ల క్లబ్ లో చేరిన దర్శకుడిగా రికార్డుని సొంతం చేసుకుని టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీగా మారిపోయారు. ఈ మూవీ తరువాత బుచ్చిబాబు స్టార్ హీరో యంగ్ టైగర్ ఎన్టీఆర్ తో ఓ భారీ స్పోర్ట్స్ డ్రామాకు శ్రీకారం చుట్టాలని ప్రయత్నాలు చేస్తున్న విషయం తెలిసిందే.
ఇదిలా వుంటే సుకుమార్ మరో శిష్యుడు పల్నాటి సూర్య ప్రతాప్ '18 పేజెస్' మూవీతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. యంగ్ హీరో నిఖిల్ నటించిన ఈ మూవీని జీఏ2 పిక్చర్స్, సుకుమార్ రైటింగ్స్ సంయుక్తంగా నిర్మించారు.
విభిన్నమైన కథ, కథనాలతో రూపొందిన ఈ మూవీలో అనుపమ పరమేశ్వరన్ హీరోయిన్ గా నటించింది. ఈ మూవీని త్వరలోనే విడుదల చేయడానికి మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. ఇదిలా వుంటే సుకుమార్ డైరెక్ట్ చేసిన వన్ నేనొక్కడినే, రంగస్థలం, పుష్ప చిత్రాలకు రైటర్ గానూ పని చేసిన పల్నాటి సూర్య ప్రతాప్ కు తాజాగా భారీ చిత్రాలని నిర్మాణ సంస్థ సితార ఎంటర్ టైన్ మెంట్స్ ఓ క్రేజీ మూవీని రూపొందించే అవకాశం ఇచ్చినట్టుగా తెలుస్తోంది.
ఇటీవల పవర్ స్టార్ పవన్ కల్యాణ్ తో 'భీమ్లా నాయక్', సిద్ధూ జొన్నల గడ్డతో 'డీజే టిల్లు'వంటి హిట్ చిత్రాలని అందించిన సితార ఎంటర్ టైన్ మెంట్స్ అధినేత సూర్యదేవర నాగవంశీ దర్శకుడు పత్నాటి సూర్య ప్రతాప్ డైరెక్షన్ లో ఓ మూవీని నిర్మించబోతున్నారట. దీనికి సంబంధించిన అఫీషియల్ అనౌన్స్ మెంట్ త్వరలోనే రానుందని తెలిసింది.
ప్రస్తుతం ఫార్చూన్ 4 సినిమాస్ బ్యానర్ తో కలిసి సితార ఎంటర్ టైన్ మెంట్స్ పై సూర్యదేవర నాగవంశీ తమిళ హీరో ధనుష్ తో 'సార్' పేరుతో ఓ ద్వి భాషా మూవీని నిర్మిస్తున్న విషయం తెలిసిందే. వెంకీ అట్లూరి డైరెక్ట్ చేస్తున్న ఈమూవీ ప్రస్తుతం చిత్రీకరణ దశలో వుంది. అ మూవీతో పాటే పల్నాటి సూర్య ప్రతాప్ మూవీని సెట్స్ పైకి తీసుకెళ్లనున్నారట. ఇందులో నటించే హీరో ఎవరు? అనే వివరాల్ని చిత్ర బృందం త్వరలోనే వెల్లడించనుందని తెలిసింది.